
సాక్షి, తాడేపల్లి: గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.
తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ జగన్ పోస్ట్ చేశారు.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమానికి ఆద్యుడు. గ్రాంధిక భాషను వదిలి ప్రజలకు అర్థమయ్యే భాషలో విద్య, సాహిత్యాన్ని అందించాలన్న సంకల్పంతో కృషి చేశారు. తెలుగు భాష తియ్యదనాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడంలో ఆయన పాత్ర అపూర్వమైనది. ఆయన సేవలకు గుర్తుగా.. ఆగస్టు 29న ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యం కోసం ప్రజల్లో చైతన్యం కలిగించే రోజుగా ఆయన జయంతికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/3EI9MHuY2O
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2025