
ఆర్‌ఓబీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలి
నెహ్రూనగర్: నగరంలో నిర్మిస్తున్న శంకర్‌విలాస్ ఆర్‌ఓబీ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలకు విముక్తి కల్పించాలని వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో నగర డెప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్‌ఓబీ నిర్మాణం కారణంగా నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి నగర ట్రాఫిక్‌పై పూర్తి అవగాహన ఉండదని, స్థానికులను ఆర్‌ఓబీ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. ఇందుకుగాను అన్ని రాజకీయపార్టీ నాయకులు, ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రికల్, జీఎంసీ, రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు సలహాలు సూచనలు స్వీకరించి దానికి అనుగుణంగా ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
వైఎస్సార్ సీపీ గుంటూరు,పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిమోదుగుల వేణుగోపాలరెడ్డి