
పింఛన్ల రద్దు దారుణం
1995 నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారికి సైతం తొలగించడం అన్యాయం కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చి డీఆర్‌ఓకు వినతిపత్రం
గుంటూరు వెస్ట్: అన్ని వర్గాలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులు ప్రతి పనికీ మాకేంటి అంటూ లెక్కలు చూడడమే తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సూపర్ సిక్స్ అంటూ ఉదరగొట్టిన ప్రభుత్వం.. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోగా.. ఉన్నవి కూడా తొలగిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తుంది. చివరకు దివ్యాంగులను సైతం కూటమి ప్రభుత్వం వదలడం లేదు. పథకాల్లో కోతే లక్ష్యంగా.. అర్హులకు సైతం అన్యాయం చేస్తూ.. ఏళ్లుగా తీసుకుంటున్న వారి పింఛన్లు సైతం తొలగించారు. దీనిపై సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బొక్క అగస్టీన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బాధిత దివ్యాంగులు హాజరై, జిల్లా అధికారులకు తమ గోడు వినిపించారు..
కూటమి ప్రభుత్వంపై దివ్యాంగుల ఆగ్రహం
వినబడదు.. మాట్లాడలేడు.. పింఛన్ ఆపేశారు
ఈ చిత్రంలోని 11 ఏళ్ల బాలుడి పేరు టి.సాయిరామ్, గుంటూరుకు చెందిన ఈ బాలుడికి వినబడదు.. మాట్లాడలేడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉంది. ఇతని రెండు చెవులకు రెండు మిషన్లు ఉంటే గానీ కాస్తంత వినబడదు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. గతంలో ఇతనికి వైద్యులు పరీక్ష చేసి 60 శాతం వైకల్యముందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడేమో అది 40 శాతమే ఉందని చెబుతున్నారు. దీంతో పింఛన్‌కు అనర్హుడయ్యాడు.
గతంలో 69 శాతం.. ఇప్పుడు 40
నేను మరగుజ్జును. గతంలో నాకు 69 అంగవైకల్యముందని సర్టిఫికెట్ ఇస్తే ఇప్పుడేమో 40 శాతముందని అంటున్నారు. వచ్చే పెన్షన్ రూ.6వేలతోనే నా జీవనం కొనసాగుతుంది. అది ఉంటుందో లేదో తెలీడంలేదు. రాదని కొందరంటున్నారు. పెన్షన్ తీసేస్తే నాకు మరో మార్గంలేదు. న్యాయం చేయాలి.
– టి.వెంటేశ్వరరావు, గుంటూరు

పింఛన్ల రద్దు దారుణం

పింఛన్ల రద్దు దారుణం