
బార్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 159 బార్లు
26 వరకు దరఖాస్తుల స్వీకరణ
మూడు సంవత్సరాల కాల పరిమితి మేరకు కేటాయింపు
ప్రతి దరఖాస్తుకు రూ.5.10 లక్షలు చెల్లించాలి
28న జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు
సమావేశంలో గుంటూరు ఎకై ్సజ్ శాఖ డీసీ కె. శ్రీనివాసులు వెల్లడి
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 159 బార్ల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుంటూరు ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 110 బార్లకు, పల్నాడు జిల్లాలో 49 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మూడు విధానాల (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. మూడు సంవత్సరాల కాల పరిమితితో కొత్త బార్ పాలసీ మేరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చని,
ఏ షాపుకై నా కనీసం నాలుగు దరఖాస్తులు వస్తానే లాటరీ తీస్తామని చెప్పారు. షాపు దక్కించుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు మూడేళ్ల కాల పరిమితితో బార్‌లను నిర్వహించుకోవచ్చని వివరించారు. 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 55 లక్షలు, 5 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఉంటుందని, దీన్ని ఏడాదిలోగా ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్పారు. ప్రతి దరఖాస్తుకు రూ .5.10 లక్షలు చెల్లించాలన్నారు. అందులో రూ. 5 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ. పదివేలు ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారుడికి వయసు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 28వ తేదిన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారిణి అరుణ కుమారి, సీఐ లత తదితరులు పాల్గొన్నారు.