
జీవాల దొంగతనాలపై పోలీసుల నిర్లిప్తత
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదు
నగరంపాలెం: జీవాలను దొంగలించే ముఠాలోని వారిని అప్పగించినా పోలీసులు పట్టించుకోవడంలేదని బాధితులు వాపోయారు. సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. జిల్లా ఏఎస్పీలు జి.వి.రమణమూర్తి (పరి పాలన), ఎ.హనుమంతు (ఏఆర్) బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్లల్లో మాట్లాడారు. బాధితుల అర్జీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమాచారాన్ని నిర్ణీత గడువులోగా డీపీఓకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు.