
పశువుల దొంగతనాలతో నష్టపోతున్నాం
మేమంతా కోడె దూడల వ్యాపారం చేస్తుంటాం. ఇళ్ల వద్దనున్న కొట్టాల్లో కట్టేసిన ఆవులు, గేదెలు, కోడె దూడలను దొంగలిస్తున్నారు. ఈనెల 10న దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పట్టుకునే ప్రయత్నంలో నలుగురు పారిపోగా, ఒకరూ పట్టుబడ్డారు. అతడిని స్థానిక పోలీసులకు అప్పగించాం. పారిపోయిన ఆ నలుగురి పేర్లను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యల్లేవు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి, అర్ధరాత్రుళ్లు కట్టేసిన జీవాల తాళ్లను తెంచుకెళ్లి తరలిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇదే వృత్తిగా జీవిస్తున్నారు. నాలుగేసి చొప్పున హైదరాబాద్‌కు తరలించి, అక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు నెలల్లో 16 జీవాలను దొంగలించారు. రెండు నెలలో మరో పదహారు గేదెలను ఎత్తుకెళ్లారు. ముఠాపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
– దొడ్డి సుధీర్ (సంపత్‌నగర్)
అబ్దుల్, ఇర్ఫాన్ (ఆనందపేట ఏడో వీధి)