
ఉచిత ఉపకరణాలు వినియోగించుకోండి
పెదకూరపాడు: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ప్రభుత్వం అందించే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ అన్నారు. పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. సెల్వరాజ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో 520 మంది విద్యార్థులు భవిత పాఠశాలలో ఉన్నారని తెలిపారు. వారిలో ఉపకరణాల అవసరమైన వారికి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రత్యేక ప్రతిభావంతులను ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకారణాలను అందించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం డాక్టర్ నితీష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధి కారి ఏకుల ప్రసాదరావు, సత్యనారాయణ, హెచ్‌ఎం కేవీ రమణ, స్కూల్ అసిస్టెంట్లు సుబ్బారావు, సుశితాప్రియ, లక్ష్మీనారాయణ, నూర్జహాన్, అచ్చయ్య, నసీమా బిగ్, బాబు, ఐఈఆర్పీ టీచర్లు లక్ష్మీ, కమల, స్వాతి, రమాదేవి, రహీం పాల్గొన్నారు.
జిల్లా సహిత విద్య సమన్వయకర్త
సెల్వరాజ్