
ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలు
తెనాలి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలను సోమవారం తెనాలిలో ప్రకటించారు. డాక్టర్ ఎన్.భగవాన్‌దాస్, బండి రాజన్‌బాబు స్మారకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ పోటీలను నిర్వహించారు. కలర్ విభాగంలో బి.జోగారావు తీసిన ‘విద్యార్థినిపై పోలీసు జులుం’ ఫొటో ప్రథమ బహుమతికి ఎంపికకాగా, ‘తాజ్‌మహల్ అందం’పై జీజేవీఎస్‌వీ ప్రసాద్ తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి, పిట్టల మహేష్ తీసిన ‘ప్రభల తీర్థం’ ఫొటో తృతీయ బహుమతికి ఎంపికయ్యాయి. మోనోక్రోమ్ విభాగంలో వనం శరత్‌బాబు ఫొటో ‘నీరు విలువైనది’ ప్రథమ బహుమతికి ఎంపికకాగా, మహేష్.జి తీసిన ‘బ్లడీ ఫైట్’కు ద్వితీయ బహుమతి, వనమామలై శ్రీనివాసాచారి ఫొటో ‘కమ్యూనిటీ బావి’కి తృతీయ బహుమతికి ఎంపిక చేశారు. రెండు కేటగిరీల్లోనూ అయిదేసి ఫొటోల చొప్పున పది ఫొటోలు మెరిట్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయి. సబ్జెక్ట్, కంపోజిషన్, టెక్నికల్స్, లైటింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ప్రకటించినట్టు ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ కానాల సుధాకరరెడ్డి తెలియజేశారు. త్వరలో జరగనున్న ప్రత్యేక సభలో విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలు

ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలు