
టేక్..డైవర్షన్..
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): దశాబ్దాల చరిత్ర ఉన్న గుంటూరులోని శంకర్‌విలాస్ ఓవర్‌బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు. ఈ నెల 9వ తేదీన బ్రిడ్జి కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావటంతో కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర కార్యాలయాలకు సెలవులు రావటంతో పెద్దగా ట్రాఫిక్ ప్రభావం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో సోమవారం నుంచి ట్రాఫిక్ రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. కొద్ది నెలల కిందట మూడు వంతెనలు పనులు జరిగిన నేపథ్యంలోనే ట్రాఫిక్‌కు ఎంత అంతరాయం ఏర్పడిందో నగర ప్రజలకు తెలియంది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఆదేశాలు మేరకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డైవర్షన్‌లు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కిడికక్కడ బారికేడ్లతో రోడ్లును మూసి, డైవర్షన్ తెలిపేందుకు సిబ్బందిని కూడా కేటాయించారు. అలాగే డైవర్షన్ తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా స్టేషన్‌ల నుంచి డిప్యూటేషన్‌లపై సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణకు రంగంలోకి దించారు.
శంకర్‌విలాస్ ఓవర్‌బ్రిడ్జి కూల్చివేత
నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

టేక్..డైవర్షన్..