
అంతర్జాతీయ వేదికపై మెరిసిన జెస్సీ
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందనలు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): జూలై 24 నుంచి 29 వరకు దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న మంగళగిరికి చెందిన అంతర్జాతీయ స్కేటర్, జెస్సీరాజ్ తన పతకాల జాబితాలో మరో మైలురాయిని చేర్చుకోవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీని జెస్సీ రాజ్ మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ముందుగా జెస్పీని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ క్రీడా ప్రయాణానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కోచ్ సింహాద్రిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, జెస్సీ విజయయాత్రలో నిరంతర ప్రోత్సాహం, నిబద్ధత కనబరుస్తున్న ఆమె తల్లిదండ్రులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు.