జెడ్పీలో ఉద్యోగుల బదిలీలు
కౌన్సెలింగ్ ద్వారా 91 మందికి స్థాన చలనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో 91 మంది ఉద్యోగులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ వి.జ్యోతిబసు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ ఒక చోట ఐదేళ్లు విధులు నిర్వహించిన వారిని ఇతర ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీ చేస్తున్నామని, ఖాళీగా ఉన్న ప్రాంతాలకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీల్లో భాగంగా ఏడుగురు పరిపాలనాధికారులతో పాటు ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది జూనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది టైపిస్టులు, ఇద్దరు ల్యాబ్ అసిస్టెంట్లు, 39 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఒక నైట్ వాచ్‌మెన్ బదిలీ అయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ రాజారత్నం పాల్గొన్నారు.


