నాటికల పోటీలు ప్రారంభం
నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. పశువుల ఆసుపత్రి సమీపంలో భారతీయ కళావేదిక వద్ద పోటీలు జరగనున్నట్లు పరిషత్ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీలను జీబీఆర్ హ్యాచరీస్ చైర్మన్ గడ్డం బుచ్చారావు, ఈదర పెద్దబ్బాయి ప్రారంభించారు. తొలిరోజు విశాఖపట్నం కళాభినయ బృందం ఆధ్వర్యంలో ‘ఓ కాశీవాస రావయ్య’ నాటిక ప్రదర్శించారు. రచయితగా పీటీ మాధవ్, దర్శకుడిగా శ్రీకవి ప్రసాద్ వ్యవహరించారు. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శించారు. రచయితగా ఆకురాతి భాస్కర్‌చంద్ర, దర్శకుడిగా నడింపల్లి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. సామాజిక దృక్పథానికి అద్దం పట్టేలా రెండు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరిషత్ పర్యవేక్షకులుగా జరుగుల రామారావు వ్యవహరించారు. కార్యక్రమాలను మువ్వా సురేష్, బండారుపల్లి సత్యనారాయణ, ఆలోకం పెద్దబ్బాయి, బండ్ల రాంచంద్, చెరుకూరి ఫణికుమార్, శాఖమూరి బాజిబాబు, బొల్లు వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం ఈతరం ఉన్నత పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నలుగురు సెల్‌ఫోన్
దొంగలు అరెస్టు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గవర్నర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పూసుగూడేనికి చెందిన బత్తుల రాజు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజకు చెందిన బండారి లక్ష్మీనారాయణ, నరసరావుపేట సంజీవయ్య కాలనీకి చెందిన ఉప్పు ఎల్లయ్య, గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన తిరుపతి వెంకట దుర్గారావులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వీరంతా పోలీసు కంట్రోల్ రూం సమీపంలో నడిచి వెళ్లే ప్రయాణికులను బెదిరించి సెల్‌ఫోన్‌లు లాక్కుని వెళ్లి పోతుంటారని సీఐ అడపా నాగమురళి తెలిపారు.


