ఆటలపై మాటల్లోనే కోటలు! | - | Sakshi
Sakshi News home page

ఆటలపై మాటల్లోనే కోటలు!

Dec 29 2025 8:02 AM | Updated on Dec 29 2025 8:02 AM

ఆటలపై

ఆటలపై మాటల్లోనే కోటలు!

ఆటలపై మాటల్లోనే కోటలు!

చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడా రంగంపై నిర్లక్ష్యం కాగితాలకే పరిమితమైన నూతన ‘క్రీడా పాలసీ’ ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదు క్రీడాకారుల జీవితాలతో పాలకుల ఆటలు నిరాశతో వలసపోతున్న ఔత్సాహిక క్రీడాకారులు

ఎవరికీ పట్టని క్రీడలు

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): అమరావతి రాజధానిలో క్రీడా నగరం నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఉన్న వాటిని కాపాడడంలో విఫలమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఔత్సాహిక క్రీడాకారులు, క్రీడాభిమానులు తమ సొంత ఖర్చుతో సొంత స్థలాల్లో చిన్న క్రీడా కోర్డులు నిర్మించి క్రీడాభివృద్దికి దోహదపడుతున్నారు. మరికొన్ని స్పోర్ట్స్‌ అసోసియేషన్లు అప్పుడప్పుడు పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం తప్పితే పెద్దగా మారిందేమీ లేదు. జాతీయ క్రీడైన హాకీకి కేవలం 3 ఎకరాలు కేటాయించాలని హాకీ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు అనేకసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించ లేదు. దీంతో జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనూ క్రీడా పోటీలు జరగలేదు. పీపీపీ విధానంలో అభివృద్ధి అంటూ దాటవేత ధోరణితో ప్రభుత్వం కొత్త ఆట మొదలెట్టింది.

కేంద్ర నిధులేవి?

జాతీయ క్రీడా పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లు క్రీడాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది. ఒక్క మన రాష్ట్రానికి తప్ప దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ నిధులు సాధించాయి. ముఖ్యంగా క్రీడల గురించి మాట్లాడే మంత్రి గానీ, ఎంపీగానీ లేరు. ఉన్న శాప్‌ కూడా అలంకారప్రాయమే. దానికి నిధులు లేవు, కనీసం అధికారలు కూడా లేదు. ఒకప్పుడు స్థానిక బీఆర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఉండేది. పిల్లలు ప్రతిభతో జాతీయ పోటీల్లో రాణించేవారు. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత ఒక్క స్పోర్ట్స్‌ హాస్టల్‌ కూడా లేకుండా పోయింది. ఒక్క మంత్రికి కూడా దీని గురించి ఆలోచించే తీరికే లేదు. పతకాలు సాధిస్తే లక్షలు కుమ్మరిస్తామంటున్న ప్రభుత్వం.. వాటిని సాధించేలా వసతులు కల్పించడంలో చేయడంలో విఫలమైంది.

అంతా రాజకీయమే....

రాజకీయ ఆటలో క్రీడాకారులు సమిధులుగా మారుతున్నారు. ఎన్టీఆర్‌ స్టేడియం నగరం నడిబొడ్డున ఉంది. ఇక్కడ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డితోపాటు కొందరు స్టేడియం సభ్యుల సహకారంతో నూతన బాస్కెట్‌ బాల్‌ కోర్టు, స్కేటింగ్‌ రింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌, అధునాత సదుపాయాలతో జిమ్‌, నూతన మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయి. పోటీలు కూడా క్రమం తప్పకుండా నిర్వహించే వారు. రెండు నెలల క్రితం ఎన్టీఆర్‌ స్టేడియం నూతన కమిటీ ఎన్నిక చివరి వరకు వచ్చి రద్దయిపోయింది. దీనికి కారణం అధికార టీడీపీలోని వర్గపోరే. పదవుల పందేరంలో బేరం కుదరకపోవడంతో చివరకు స్టేడియం అనాథయింది. స్టేడియం ప్రారంభం నుంచి ఉన్న సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,800 మంది సభ్యులున్న స్టేడియంలో ఇప్పటి వరకు నూతన కమిటీ లేకపోవడంతో క్రీడాభివృద్ధి కుంటుపడింది. ప్రశ్నించే వారిని సైతం బెదిరిస్తున్నారు.

క్రీడలంటే ఎవ్వరికీ పట్టడం లేదు. హాకీ కోసం మూడు ఎకరాలు ఎన్నోసార్లు అడిగాం. స్థలం ఇస్తే మేమే బాగు చేసుకుంటామన్నా కనికరించడం లేదు. మన రాష్ట్రంలో ఒక్క స్పోర్ట్స్‌ హాస్టల్‌ కూడా లేదు. క్రీడాకారులు ఎలా వస్తారండి? కేంద్రం నుంచి నిధులు కూడా రావడం లేదు. హాకీకి సాధన అవకాశం లేకపోవడంతో క్రీడాకారులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఉన్న వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలి.

– హర్షవర్ధన్‌, కార్యదర్శి, హాకీ ఆంధ్రప్రదేశ్‌

ఈ ఏడాది జిల్లా క్రీడా రంగానికి నిరాశే మిగిలింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ మంత్రాన్నే జపిస్తూ బాధ్యతల నుంచి తప్పుకొనే ప్రయత్నాలను తీవ్రం చేసింది. పట్టణంలోని ప్రసిద్ధ బీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ ఏడాది కొత్తగా నిధులు కేటాయించలేదు. నూతన నిర్మాణాలు చేపట్ట లేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆటలపై మాటల్లోనే కోటలు! 1
1/1

ఆటలపై మాటల్లోనే కోటలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement