డబ్బు పంపకంలో తేడాలతో కోటేశ్వరరావు హత్య ?
మంగళగిరి: మండల పరిధిలోని కాజ, పెదవడ్లపూడిల మధ్య బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు నగదు పంపకంలో తేడాలే కారణమని సమాచారం. కోటేశ్వరరావుతో పాటు ఇద్దరు మహిళలు హిహిజ్రాలు వేషాలు ధరించి తెనాలి, దూర ప్రాంతాల్లో దుకాణాల ప్రారంభం, గృహ ప్రవేశాలకు వెళ్లి డబ్బులు అడుక్కుని జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో తెనాలికి చెందిన అన్నపురెడ్డి దిలీప్‌కు వీరిలోని మహిళ నర్మదతో పరిచయం ఏర్పడింది. మండలంలోని నవులూరు టిడ్కో ఇళ్లలో అద్దెకు నివసిస్తున్నారు. కోటేశ్వరరావు ఆడవారి దుస్తులు ధరించి హిజ్రా వేషధారణలో తిరుగుతుంటాడు. దుకాణాల వద్ద వచ్చిన ఆదాయం పంపకంలో కోటేశ్వరరావు, మహిళల మధ్య వివాదం నెలకొంది. బుధవారం రాత్రి కాజలో మద్యం తాగి కోటేశ్వరరావు పెదవడ్లపూడి డొంక రోడ్డులో వెళుతుండగా ఘర్షణ జరిగింది. అది పెద్దది కావడంతో దిలీప్‌తో పాటు ఇద్దరు మహిళలు కలిసి కోటేశ్వరరావును హత్య చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దిలీప్, నర్మదతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో
ముగ్గురు నిందితులు


