ఉద్యోగాల పేరిట టోకరా
నగరంపాలెం: ఉద్యోగాల పేరిట మోసగించారంటూ పలువురు బాధితులు వాపోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొలువులు ఇప్పిస్తామని ఆశ చూపి, లక్షల్లో కాజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఏఎస్పీ (పరిపాలన) జి.వి.రమణమూర్తి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి మొరను ఆలకించారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. డీఎస్పీలు శివాజీరాజు (క్రైం), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు.
రూ. లక్షల్లో కాజేశారని బాధితుల ఆవేదన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొర


