గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Apr 9 2025 2:17 AM | Updated on Apr 9 2025 2:17 AM

గుంటూ

గుంటూరు

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
దరఖాస్తు ఇలా..

జిల్లా జైలులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తనిఖీలు

గుంటూరు లీగల్‌: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ తనిఖీ చేశారు. ఆయన కారాగారంలో ఉన్న లీగల్‌ సర్వీసెస్‌ క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంపై పలు సూచనలు చేశారు. జైల్లో ఏ ఒక్క ముద్దాయి న్యాయ సహాయం పొందకుండా ఉండకూడదని, ప్రతి ఖైదీకి ఉచిత న్యాయ సహాయం త్వరితగతిన అందించటానికి తగు సూచనలు చేశారు. వంటశాలను పరిశీలించి అక్కడ ఖైదీలకు అందించే ఆహారాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు సిబ్బందికి వంటశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఖైదీలకు అందించే భోజనం, ఇతర సదుపాయాల గురించి విచారించగా సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఈయన వెంట డెప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఎస్‌.బి.ఏ. ఝాన్సీ, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ పారా లీగల్‌ వలంటీర్స్‌, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.00 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌ – 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్‌–2025కు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets. apsche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యి ఏపీ ఈఏపీసెట్‌–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈఏపీసెట్‌ సైట్‌లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్‌స్ట్రక్షన్స్‌ మాన్యువల్‌ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు.

ధ్రువపత్రాల వివరాలు తప్పనిసరి

● ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌ కేటగిరీల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో క్లిక్‌ చేయాలి. అదేవిధంగా సంబంధిత ధ్రువపత్రానికి సంబంధించిన నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు.

● విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ వరకు ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యాసంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివర్లో ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్‌ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్‌ చేయాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి తన సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు.

● ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేసి సబ్‌మిట్‌ చేసిన తరువాత ప్రింటవుట్‌ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్‌తో పాటు ఆన్‌లైన్‌ ప్రింటవుట్‌ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.

7

న్యూస్‌రీల్‌

దరఖాస్తు చేసేందుకు ఈనెల 24 చివరి తేదీ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27వరకు ఇంజినీరింగ్‌కు సంబంధించి టెస్ట్‌ దరఖాస్తు సమయంలో జాగ్రత్తలతో కౌన్సెలింగ్‌లో తొలగనున్న ఇబ్బందులు

ఏపీఈఏపీసెట్‌–2025 సైట్‌కు లాగిన్‌ అయిన తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాలి. స్టెప్‌–1 మొదలు స్టెప్‌–5 వరకు ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్‌ చేస్తూ, పొందుపర్చిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్టెప్‌1: ‘ఎలిజిబులిటీ క్రైటీరియా అండ్‌ ఫీజు పేమెంట్‌’కు లాగిన్‌ అయ్యి సీనియర్‌ ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబరు ఎంటర్‌ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు, ఆల్టర్నేటివ్‌ మొబైల్‌ నంబరు, ఈ–మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. దీంతో పాటు ఇంజినీరింగ్‌–ఫార్మసీ, అగ్రికల్చర్‌–ఫార్మసీ, బోత్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని, క్లిక్‌ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఫీజు పేమెంట్‌ చేయాలి. క్రెడిట్‌, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ మార్గాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంది.

స్టెప్‌–2: నో యువర్‌ పేమెంట్‌ స్టేట్‌స్‌పై క్లిక్‌ చేసి, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నంబరు, మొబైల్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. తదుపరి చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్‌ చేయడంతో స్టెప్‌–2 దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్‌–3: ఫిల్‌ అప్లికేషన్‌లో పేమెంట్‌ చేసిన ఐడీతో పాటు సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్‌ టు ఫిల్‌ అప్లికేషన్‌పై క్లిక్‌ చేయాలి.

స్టెప్‌–4: ఇక్కడ నో యువర్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు.

స్టెప్‌–5: ఇక్కడ క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకుని భద్రపరచుకోవాలి.

ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్‌ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌, పుట్టినతేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్‌, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి.

గుంటూరు1
1/9

గుంటూరు

గుంటూరు2
2/9

గుంటూరు

గుంటూరు3
3/9

గుంటూరు

గుంటూరు4
4/9

గుంటూరు

గుంటూరు5
5/9

గుంటూరు

గుంటూరు6
6/9

గుంటూరు

గుంటూరు7
7/9

గుంటూరు

గుంటూరు8
8/9

గుంటూరు

గుంటూరు9
9/9

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement