గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Feb 9 2024 1:34 AM | Updated on Feb 9 2024 1:34 AM

- - Sakshi

శుక్రవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2024

పర్యాటక ప్రేమికుల మనసుల్ని కట్టిపడేసే ప్రకృతి సోయగాలు కొండవీడు సొంతం. ప్రకృతి విహార ప్రాంతాల సమాహారం. సహజ అందాలతో అలరారే కొండవీడు సరికొత్త అందాలకు నెలవుగా మారింది. పట్టణ, నగర వాసులు వారాంతంలో ఆనందంగా గడిపే అనువైన స్థలంగా రూపుదిద్దుకుంది.

యడ్లపాడు: కొండవీడును పర్యాటక కేంద్రంగా రూపొందించాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో రూ.5 కోట్ల నిధులిచ్చి శ్రీకారం చుట్టగా..ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొండవీడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు ఇవ్వడం జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నా యి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ గిరిదుర్గంపై మరోమారు ఉత్సవాలు జరగనున్నాయి. కొండవీటి ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు, సామంతులు, చక్రవర్తులు శతాబ్ద కాలానికిపైగా ఏలిన అద్దంకి రెడ్డిరాజులు, అన్నింటికి మించి తెలుగువారి పాలనా వైభవాలను భావితరాలకు చూపడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యంగా శని, ఆదివారాలలో కొండవీడు ఫెస్ట్‌–2024 నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి శ్రీకారం చుట్టారు.

ఉత్సవాల ప్రత్యేకం

రెండు పారా మోటరింగ్‌, ఒక హెలీరైడ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, రాక్‌ క్లైంబింగ్‌, చారిత్రక ఛాయాచిత్ర, సైకత శిల్ప ప్రదర్శన, ఫ్లవర్‌షో, ఫుడ్‌ ఫెస్ట్‌, చిల్డ్రన్స్‌ ఎగ్జిబిషన్‌, క్లాసికల్‌, వెస్ట్రన్‌ డాన్స్‌ పోటీలను ఏర్పాటు చేశారు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నగరవనం పేరిటా ఏటా ఇస్తున్న నిధులతో నైట్‌ క్యాంపు గుడారాలు, చీకటి భయం లేకుండా విద్యుద్దీపాలు, నిఘా నేత్రాలు కలిగిన కెమెరాలు, ఒంపైన ఘాట్‌రోడ్లు, తడపడకుండా అడుగడుగున సూచికలు, ప్రతి కట్టడం వద్ద దాని చరిత విశిష్టత తెలిపే బోర్డులు, సెల్పీలకు చెరువులో డెక్‌లు, ఆటలాడేందుకు చిల్డ్రన్స్‌ పార్కు. శతృదుర్బేద్య చరితను తెలిపే థీమ్‌పార్కు, యువత అమితంగా ఇష్టపడే సాహస క్రీడలు, ఏటవాలు కొండలు, లోయల్ని చూపే వ్యూపాయింట్స్‌. స్వాగత ద్వారం, సేదదీరేందుకు షెల్టర్స్‌, భోజనాశాలలు, తాగునీరు, కొండపై హార్స్‌ రైడింగ్‌ ఏర్పాటు చేశారు.

న్యూస్‌రీల్‌

గిరిదుర్గం రాష్ట్రానికే తలమానికం.. ఆంధ్ర గోల్కొండగా సార్థకం మరోమారు కొండవీడుకోటలో ఉత్సవాలు రేపటి నుంచి రెండు రోజులపాటు కొండవీడు ఫెస్ట్‌–2024

హెలికాప్టర్‌ రైడ్‌లో పిల్లలకు రాయితీ

నరసరావుపేట: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొండవీడు ఫెస్ట్‌–2024లో హెలికాప్టర్‌ రైడ్‌కు సంబంధించి 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుంలో రాయితీ ఉంటుందని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ గురువారం వెల్లడించారు. పిల్లలకు టికెట్‌ ధర రూ.4వేలుగా నిర్ణయించామని తెలిపారు. స్కూలు పిల్లలు బస్సులు లేదా గ్రూపుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం ఉండదని తెలిపారు.

చేరువ చేయడమే లక్ష్యం

సందర్శకులకు అంతులేని ఆనందం..మధుర జ్ఞాపకంగా మిగిలిపోయేలా కొండవీడు ఫెస్ట్‌ను రూపొందిస్తున్నాం. వినోద విందులు, సహ పంక్తులు, సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్ర ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించనున్నాం. వీటికితోడు సరదా ఆటలు, సాహాస క్రీడలు, సాంస్కృతిక పోటీలతో పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరూ హాయిగా గడిపేలా రంగం సిద్ధం చేస్తున్నాం. తెలుగువారి ఘన చరిత్రను ప్రతిఒక్కరికీ మరింత చేరువ చేయడమే ఉత్సవాల ముఖ్యోద్దేశం.

–శివశంకర్‌ లోతేటి, కలెక్టర్‌, పల్నాడు జిల్లా

నిత్యం కొత్తదనమే

సందర్శకులకు కావాల్సిన అన్ని వసతుల్ని ఏర్పాటు చేస్తున్నాం. నిరంతరాయంగా జరిగే అభివృద్ధితో కొండవీడు నిత్యం సరికొత్తగానే దర్శన మిస్తోంది.

–ఎన్‌ రామచంద్రరావు, డీఎఫ్‌వో, పల్నాడు జిల్లా

అందంగా రూపుదిద్దిన కొండవీడు స్వాగత ద్వారం1
1/8

అందంగా రూపుదిద్దిన కొండవీడు స్వాగత ద్వారం

2
2/8

3
3/8

కొండవీడు గిరిదుర్గం4
4/8

కొండవీడు గిరిదుర్గం

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement