
పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే కనిపిస్తోన్న ఈ పంధా... సింగపూర్‌లో ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. పిల్లలను కనే వయసు దాటిపోతున్నా అనేకమంది వివాహిత స్త్రీలు నిర్లిప్తంగా ఉంటూ చివరకు సంతానం లేకుండా మిగిలిపోతున్నారు
గత 2024లో 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 15 శాతం మందికి పిల్లలు లేరని సింగపూర్‌కి చెందిన స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ గత ఫిబ్రవరి 18న, గణాంకాలను విడుదల చేసింది. ఇది 2004లో 7.1 శాతం కంటే రెట్టింపు కాగా, అయితే ఇది 2014లో ఈ సంఖ్య 11.2 శాతంగా ఉంది. సింగపూర్‌లోని ఇన్సి్టట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ సీనియర్ రీసెర్చ్ ఫెలో టాన్ పోహ్ లిన్ మాట్లాడుతూ పిల్లలు లేని జంటల నిష్పత్తిలో పెరుగుదలను ‘చాలా వేగంగా‘ సంభవిస్తోందని అంటున్నారు.
ఈ పరిస్థితిని పురస్కరించుకుని అక్కడి మీడియా స్థానికులను ఇంటర్వ్యూలు చేస్తూ కారణాలను అన్వేషిస్తోంది. పిల్లలు వద్దనుకునేందుకు సింగపూర్ వాసులను ప్రేరేపిస్తున్నవి ఏమిటి? అని ఆరాతీస్తోంది...జీవనశైలి ప్రాధాన్యతలు, ప్రతికూల బాల్య అనుభవాలు పిల్లలను పెంచే అపారమైన బాధ్యత గురించిన భయం వంటి ఇతర కారణాల వల్ల తాము పిల్లల్ని కనకూడదనే నిర్ణయం తీసుకున్నామని పలువురు ఆ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
‘‘బిడ్డను కనడం చాలా పెద్ద బాధ్యత, పైగా వారు ఎలా మారతారో తెలీదు. నేను మరొక జీవితానికి నేను బాధ్యత వహించాలని అనుకోవడం లేదు’ అని ఓ యువతి చెప్పింది. ‘‘ పిల్లలు కాదు‘నేను నా స్వేచ్ఛను నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించగల సామర్థ్యాన్ని కూడా చాలా విలువైనదిగా భావిస్తున్నాను’’ అంటూ మరొకరు చెప్పారుు. తాము ప్రయాణాలు చేస్తూ ‘జీవితాన్ని అన్వేషించడం‘ తమ లక్ష్యాలుగా జంటలు వెల్లడిస్తున్నారు. పిల్లలను కలిగి ఉండటం వల్ల తాము చేయాలనుకున్న చాలా పనులను చేయలేమని, ఉద్యోగ సెలవులను కూడా తమ కోసం వినియోగించుకోలేమని చెబుతూన్నారు. సమాన అవకాశాలతో సాధికారత పొందడం, తమ విభిన్న ఆసక్తులను కొనసాగించడం కోసం సమయాన్ని వెచ్చించడానికి తాము ఇష్టపడుతున్నామని మహిళలు చెబుతున్నారు.
పిల్లల చదువుల విషయంలో తమ స్నేహితులు ఎదుర్కొనే ఒత్తిళ్లను గమనించిన తర్వాత పిల్లల్ని కనదలచుకోలేదని, నేటి ప్రపంచంలో పిల్లలను పెంచడం మునుపటి కంటే చాలా క్లిష్టంగా ఉందని వీరు అంటున్నారు. ‘‘పిల్లలను కనడానికి కాదు...పెంపకంలో నాకు తెలియనిది చాలా ఎక్కువ. పిల్లవాడు బాగుంటాడా? నేను ఆల్ రైట్ పేరెంట్ అవుతానా?’’, అనే భయాలు తమని వెంటాడుతున్నాయని చెబుతున్నారు.
ఇలా పెళ్లి ఓకే కానీ పిల్లల్ని వద్దనుకుంటున్న జంటల సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో సింగపూర్ ప్రభుత్వం అనేక రకాల దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సహిస్తూ, సింగపూర్ వాసులు ఎక్కువ మంది పిల్లలను కనేలా చేయాలని, పెద్ద కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంది.
గత ఫిబ్రవరి 18న తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, కొత్త పెద్ద కుటుంబాల పథకంలో భాగంగా, ఫిబ్రవరి 18న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి మూడవ తదుపరి సింగపూర్ బిడ్డకు కుటుంబాలు 16,000 డాలర్ల వరకు అదనపు మద్దతును అందిస్తామని ప్రకటించారు. Satyababu