నిశ్శబ్దపు చీకటిలో ఆశాకిరణం | The Guest Column Story Marking International Day Of Deafblindness | Sakshi
Sakshi News home page

నిశ్శబ్దపు చీకటిలో ఆశాకిరణం

Jun 27 2026 11:54 AM | Updated on Jun 27 2026 11:54 AM

The Guest Column Story Marking International Day Of Deafblindness

ఇన్‌ బాక్స్‌

అంతర్జాతీయ బధిరాంధ దినోత్సవం

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ డెఫ్‌బ్లైండ్‌నెస్‌

జూన్‌ నెల చివరి వారాన్ని ‘బధిరాంధ అవగాహనా వారం’గా అంతర్జాతీయ బధిరాంధ దినోత్సవం (జూన్‌ 27) సందర్భంగా జరుపుకోవడం 2025 నుంచి ప్రారంభమైంది. రచయిత్రి, సామా జిక కార్యకర్త హెలెన్‌ కెల్లర్‌ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి వీటిని ప్రకటించింది. బధిరాంధత్వం అంటే కళ్లతో పాటు చెవులు కూడా పనిచేయకపోవడం. గాఢాంధకారం, భయంకరమైన నిశ్శబ్దం...

ఈ రెంటి కలయిక వల్ల అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు బాహ్య ప్రపంచంతో సంభాషించడానికి ప్రధానంగా చేతిపై చేతితో రాసే సంకేత భాష (టాకై్టల్‌ సైన్‌ లాంగ్వేజ్‌), బ్రెయిలీ లిపి, ఇంటర్‌ప్రెటర్లపై ఆధారపడ తారు. ప్రపంచ జనాభాలో 0.2% – 2% ప్రజలు ఏదో ఒక స్థాయి బధిరాంధత్వంతో జీవిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ సమస్యతో పోరాడుతున్నారు.

ప్రభుత్వాలు బధిరాంధత్వాన్ని చట్టపరంగా ఒక ప్రత్యేక వైకల్యంగా గుర్తించాలి. అంధులకు, బధిరులకు విడివిడిగా ఇచ్చే సేవలను కలిపి వీరికి అంటగట్టడం సరైన విధానం కాదు. రోజువారీ పనులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన ఇంటర్‌ప్రెటర్‌–గైడ్‌ల సేవలను ఉచితంగా ప్రభు త్వాలు అందించాలి. అలాగే, పాఠశాలల్లో సమ్మిళిత విద్యను ప్రోత్సహించ డానికి ప్రత్యేక టీచింగ్‌ అసిస్టెంట్లను నియమించి, పాఠ్యాంశాలను వీరికి అనుకూలంగా మార్చాలి. ఆధునిక సాంకేతికత తోడ్పాటుతో టాకై్టల్‌ పరిక రాలు, రిఫ్రెషబుల్‌ బ్రెయిలీ డిస్‌ప్లేలు, వైబ్రేషన్‌ ద్వారా అలర్ట్‌ చేసే స్మార్ట్‌ పరికరాలను అందుబాటులోకి తేవాలి.

హబెన్‌ గిర్మా, హార్వర్డ్‌ లా స్కూల్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మొదటి బధిరాంధ మహిళ. వైబ్రేషన్‌–బ్రెయిలీ డిస్‌ప్లే కలిగిన డిజిటల్‌ టెక్నాలజీ సహాయంతో సంభాషిస్తూ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్న తనంలోనే చూపు, వినికిడి కోల్పోయిన ప్రదీప్‌ సిన్హా, అసిస్టివ్‌ టెక్నాలజీ సహాయంతో కంప్యూటర్‌ ఆధారిత నైపుణ్యాలను నేర్చు కుని కార్పొరేట్‌రంగంలో ఉపాధి పొందుతుండగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా శిఖరే ఆభర ణాల తయారీలో రాణిస్తూ సొంతంగా ఆర్థిక స్వాలంబన సాధించారు. తగిన సదుపాయాలు కల్పిస్తే, బధిరాంధులు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరనే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. – శ్రీనివాస్‌ మాధవ్‌, సామాజిక కార్యకర్త (నేడు ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ డెఫ్‌బ్లైండ్‌నెస్‌’)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement