శ్లోకా మెహతా స్టైలిష్‌ లుక్‌ సీక్రెట్‌ ఇదే..! ఆ స్పెషల్‌ లెహంగాలు.. | Woman Behind Shloka Mehtas Unique Outfits | Sakshi
Sakshi News home page

శ్లోకా మెహతా స్టైలిష్‌ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!

Sep 20 2024 6:09 PM | Updated on Sep 20 2024 6:12 PM

Woman Behind Shloka Mehtas Unique Outfits

రిలయన్స్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంట గత నెల జులైలో గ్రాండ్‌గా అనంత్‌ రాధికల వివాహం జరిగి సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో అంబానీ మహిళలంతా స్టైలిష్‌ ఐకాన్‌లు లాగా అత్యంత ఆకర్షణీయంగా కనిపించారు. ఆ వివాహ తంతులో ఆ ఇంట మహిళలు ధరించిన జ్యువెలరీ దగ్గర నుంచి చీరల వరకు ప్రతిది హైలెట్‌గా కనిపడింది. అయితే ఈ వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపించింది శ్లోకా మెహతా అనే చెప్పాలి. ఆమె ప్రతి ఈవెంట్‌కి ధరించిన డ్రెస్‌, జ్యువెలరీ ఇలా ప్రతిదీ అత్యంత లగ్జరియస్‌గా ఉండటమే గాక ఆమె కూడా స్టైలిష్‌ ఐకానిక్‌గా మెరిసింది. ఆ కార్యక్రమంలో అందరి దృష్టి శ్లోకా మీదనే ఉంది. అంతలా తన విభిన్నమైన స్టైలిష్‌ లుక్‌తో కట్టిపడేసింది శ్లోకా. అందుకు కారణం ఎవరో తెలుసా..!

ఆమె ఎవరో కాదు ముఖేశ్‌ నీతా అంబానీల ప్రత్యేక అనుబంధ కలిగిన మహిళ. శ్లోకా మెహతాకి స్వయనా చెల్లెలు అయినా దియా మెహతా జాతియా. ఆమె స్కూల్‌ చదువంతా అంబానీ స్కూల్‌లోనే సాగింది. ఆ తర్వాత తన అభిరుచి రీత్యా లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌లో చేరి ఫ్యాషన్‌కి సంబంధించిన గ్రాఫిక్‌ డిజైన్‌ చేసింది. 

 

ఇక దియా అంబానీ ఇంట జరిగే గ్రాండ్‌ వేడుకలో తన అక్క శ్లోకా రూపాన్ని అందంగా కనిపంచేలా ప్రముఖ డిజైనర్‌లతో కలిసి మంచి లెహంగాలను డిజైన్‌ చేసింది. అవి కూడా మన వారసత్వానికి చిహ్నంగా ఉండే చీరలనే ఎంపిక చేసుకుని మరీ డిజైన్‌ చేయడమ ఆమె ప్రత్యేకత. ఆ వివాహ వేడుకలో జరిగే ప్రతి తంతులో ఇషా ప్రతి లుక్‌ని చాలా అద్భుతంగా తీర్చదిద్దింది. 

ఆమె కేవలం ఫ్యాషన్‌ డిజైనర్‌ మాత్రమే గాదు విభిన్న వెంచర్‌లు కలిగిన వ్యాపారవేత్త కూడా. అంతేగాఉ ఆమె అత్యంత డిమాండ్‌ ఉన్న స్టైలిస్ట్‌ డిజైనర్‌లో ఒకరు కూడా. ఆమె యూకే ఆధారిత రెస్టారెంట్‌ యజమాని ఆయుష్‌ జాతియాను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.

(చదవండి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి మర్లెనా ఇష్టపడే రెసిపీ ఇదే..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement