వాలెంటైన్స్‌డే స్పెషల్‌ : అందంగా మెరిసిపోవాలంటే..!

valentines day special check these amazing skincare and beauty tips - Sakshi

ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా ‘వాలంటైన్స్‌  డే ’ఫీవరే.   వాలెంటైన్ వీక్​  అంటూ ప్రేమికులు వారం రోజులపాటు సంబరాలు చేసుకుంటారు.  ఫిబ్రవరి 14న  ప్రేమికుల దినోత్సవంతో  ఈ సంబరాలు పీక్‌ అన్నట్టు.  మరీ మీ ఫేస్‌ అందంగా, ఫుల్‌ వాలెంటైన్‌ గ్లోతో అచ్చమైన చందమామలా  మెరిసిపోవాలిగా? అందుకే... ఈ చిట్కాలు  మీ కోసమే...!

అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్‌ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరాదోస పిగ్మెంటేషన్‌ సమస్యను దూరం చేస్తుంది. ఇది ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి ముఖ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

 పాలల్లో కొద్దిగా ఓట్స్‌ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కల΄ాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బ్లాక్‌హెడ్స్‌ ఉన్న చోట అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్‌ క్లెన్సర్‌ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్‌ సులభంగా తొలగిపోతాయి.

 రెండు టీస్పూన్ల వేప పొడి, ఒక స్పూన్‌ నిమ్మరసం తీసుకోండి. వీటిని మెత్తగా చేసి ముఖం, మెడ భాగాలల్లో రాయాలి. పావు గంట తర్వాత చల్లటి నీటితో వలయాకారంలో ముఖాన్ని రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది.  

లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌
చర్య సౌందర్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమైనది. చివరి నిమిషంలో మొటిమలు రాకుండా ఉండటానికి చక్కెర ,పాల ఆహారాలకు దూరంగా ఉండండి. ఒక కప్పు వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మచింది. ఇలాచే స్తే టాక్సిన్స్‌ అన్నీ పోయి చర్మానికి మెరుపు వస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రోకలీ బచ్చలికూర, క్యారెట్లు, అవకాడోలు, అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయలులాంటి వాటిని డైట్‌లో  చేర్చుకోండి. తగినంత నీరు త్రాగడం మీ చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచుతుందనే మర్చిపోకూడదు.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top