గంటకు 260 కిలోమీటర్ల వేగం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు | USA Start-up Company Zeva Launches Flying Saucer Only Chargable | Sakshi
Sakshi News home page

Flying Saucer: గంటకు 260 కిలోమీటర్ల వేగం.. ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు

May 8 2022 2:08 PM | Updated on May 8 2022 2:08 PM

USA Start-up Company Zeva Launches Flying Saucer Only Chargable - Sakshi

ఎగరాలంటే విమానం ఎక్కాలి. కనీసం హెలికాప్టరైనా ఉండాలి. వీటికి చాలా తతంగం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫ్లైయింగ్‌ కార్లు అక్కడక్కడా వస్తున్నాయి. వాటికి ఇంధనం బాగానే ఖర్చవుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫ్లైయింగ్‌ సాసర్‌ ఉంటే, ఎక్కడికైనా తేలికగా పక్షిలా ఎగిరి వెళ్లవచ్చు. కోరుకున్న చోట హాయిగా వాలిపోవచ్చు. దీనికి ఇంధనం సమస్య ఉండదు. ఇది పూర్తిగా రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.

అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ ‘జెవా’ ఈ ఫ్లైయింగ్‌ సాసర్‌ను రూపొందించింది. ఇందులో ఒక మనిషి మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. ఇందులో బ్యాటరీని పూర్తిగా చార్జి చేస్తే, 80 కిలోమీటర్ల దూరం ఏకధాటిగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ఠవేగం గంటకు 260 కిలోమీటర్లు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement