
ఉన్నత చదువులు చదివించడం సాధ్యం కాదని ప్రతి మధ్యతరగతి తలిదండ్రులు అనుకుంటుంటారు. తమ తాహతకు మించి చదువులు అనవసరం అనే భావన చాలామంది పేరెంట్స్‌లో ఉంటుంది. కానీ ఇక్కడొక వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా..ఇద్దరి పిల్లల్ని డాక్టర్లుగా చేశాడు. ఏడు సార్లు ఫెయిలైనా..తన పిల్లలు ఏనాటికైనా సాధిస్తారనే భావించాడు. కొడుకులు కూడా అతడి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. స్ఫూర్తిదాయకమై కథ, పేరెంటింగ్‌కి గొప్ప నిర్వచనం కూడా.
27 ఏళ్ల జినాల్, అతడి తమ్మడు 22 ఏళ్ల పారిన్ ష్రాఫ్‌లు వైద్యులుగా తీర్చిదిద్దడానికి తమ తల్లిదండ్రులు ఎంతలా కష్టపడ్డారో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డాక్టర్లు కానున్నా ఇద్దరు సోదరులు తమ ప్రస్థానం అంత ఈజీగా సాగాలేదన్నారు. తమ తాత గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోవడంతోనే డాక్టర్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. తమ తల్లిదండ్రుల జీవనాధారం సమోసాల దుకాణం.
దాని మీద వచ్చే ఆదాయంతోనే కష్టపడి చదింవించారని తెలిపారు. అయితే నిట్ ఎగ్జామ్ ప్రిపేరవ్వతున్నప్పుడూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో కూడా చెప్పారు. జినాల్ నీట్ కల దాదాపు సాధ్యం కాదనే పరిస్థితుల్లో ఉన్నట్లు నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. వరుసగా మూడుసార్లు ఫెయిలై ఇబ్బంది పడుతున్న తరుణంలో మరో ప్రయత్నంలో అనారోగ్యం బారినపడి ఎంతలా ఇబ్బంది పడ్డాడో వివరించాడు జినాల్. అలా ఏడుసార్లు ఫెయిలైనా తల్లిదండ్రులు ఏం పర్లేదు అంటూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు.
తల్లిదండ్రలు చూపిస్తున్న అపారమైన ప్రేమ తనలో కసిని పెంచి ఏడో ప్రయత్నంలో విజయం సాధించడమే కాదు మంచి కాలేజ్‌లో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు పెద్దవాడు జినాల్. ఇక సోదరుడు పారిన్ ష్రాఫ్ రెండో ప్రయత్నంలోనే విజయ కేతనం ఎగరవేశాడు. అంత బాగానే సాగింది అనుకునేలోపు ఆ సోదరులు కాలేజ్‌లో సీట్లు పొందడానికి 20 లక్షల బాండ్‌లను సమర్పించాల్సి ఉంది. తనఖా పెట్టడానికి ఎలాంటి ఆస్తి లేని ఆ నిరుపేద కుటుంబం మళ్లీ కుదేలు అయిపోంది. ఆ
ఆపదను గట్టెక్కించడానికి తండ్రి స్నేహితులు మందుకు రావడం విశేషం. అంతేగాదు ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో తమ గురువు రామానంద్ సార్ పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తమ ఆర్థిక పరిస్థితి గమనించి.. పలు స్కాలర్‌షిప్‌లు, మెంటర్‌షిప్‌లు, వంటి వాటి గురించి తెలియజేసి ప్రోత్సహించారని తెలిపారు. ఆ ఇరు సోదరులు వైద్య విద్య మూడో ఏడాది చదువుతున్నారు. ఇక తమ చదువు పూర్తి అయ్యిన వెంటనే పేద రోగులకు ఉచిత వైద్య అందించేలా చేయడమే తమ లక్ష్యం అని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఆ సరస్వతి పుత్రులకు ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి..
(చదవండి: భారత్ జిమ్ సంస్కృతి బాగుంటుంది..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..)