బెట్టింగ్‌ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో ఇంట్రస్టింగ్‌ ట్వీట్‌ వైరల్‌ | TSRTC Md V C Sajjanar tweets anti betting pps song goes viral | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో ఇంట్రస్టింగ్‌ ట్వీట్‌

Apr 22 2025 2:52 PM | Updated on Apr 22 2025 5:36 PM

TSRTC Md V C Sajjanar tweets anti betting pps song goes viral

‘వద్దురా..సోదరా..బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు రా’

బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు  కృషిచేస్తున్నారు ఆర్టీసీ ఎండీ   సజ్జనార్‌. బెట్టింగ్‌ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’ పేరుతో సజ్జనార్‌ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే.

బెట్టింగ్‌ యాప్స్‌ మోజులో అనేకమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’  అనే ఉద్యమాన్ని ప్రారంభించారు సజ్జనార్‌.  ఈ పోరు భాగంగానే తాజాగా ‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు అంటూ  ఒక చక్కటి గీతాన్ని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌  చేశారు.

మన్మథుడు సినిమాలోని ‘వద్దురా.. పెళ్లొద్దురా ’  అనే సాంగ్‌ తరహాలో  వద్దురా.. సోదరా.. బెట్టింగ్‌ జోలికి పోవద్దురా అంటూ  ఇద్దరు గాయనీ మణులు ఒక పేరడీ సాంగ్‌ను పాడారు. దీన్ని సజ్జనార్‌   ట్వీట్‌ చేశారు.

‘‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!

 ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. బెట్టింగ్‌ యాప్స్‌ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి’’ అంటూ ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌  అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది.  కాగా బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకుని  ఆత్మహత్యలకు పాల్పడిన అనేక ఘటనలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రాల్లో కలకలం రేపాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement