సాయంత్రం స్నాక్స్ గా చిల‌క‌డ‌దుంప బ‌జ్జీలు | Sakshi
Sakshi News home page

సాయంత్రం స్నాక్స్ గా చిల‌క‌డ‌దుంప బ‌జ్జీలు

Published Sun, Oct 8 2023 9:05 AM

Sweet Potato Bajji Recipe - Sakshi

కావలసినవి:  

చిలగడదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు
పచ్చిమిర్చి ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్  చొప్పున
ఉల్లిపాయముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌ (చిన్నగా కట్‌ చేసుకోవాలి)
బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి)
ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు
గరం మసాలా – 1 టీ స్పూన్
కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా
శనగపిండి – పావు కప్పు
బియ్యప్పిండి – 3 టేబుల్‌ స్పూన్లు
బేకింగ్‌ సోడా, కారం – 1 టీ స్పూన్  చొప్పున
నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా పాన్ లో 1 టేబుల్‌ స్పూన్  నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, చిలగడదుంప గుజ్జు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్‌ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్‌ సోడా, కారం వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చిలగడదుంప–గరం మసాలా మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌లో బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి, బజ్జీల్లా.. కాగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి.

(చ‌ద‌వండి: కొత్త టెక్నిక్ తో రుచిక‌ర‌మైన వంట‌లు.. )

Advertisement
 
Advertisement