ఈ రైల్వే స్టేషన్‌ పేరు సచిన్‌!

Sunil Gavaskar shares pic of himself at Sachin Railway Station in Gujarat - Sakshi

వైరల్‌

స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్‌లకు క్రికెటర్‌ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్‌లోని సూరత్‌ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్‌ పేరు సచిన్‌. మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఈ రైల్వేస్టేషన్‌ ముందు దిగిన ఫోటో వైరల్‌గా మారింది.

‘ఈ రైల్వేస్టేషన్‌కు మన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌లలో ఒకరైన నా ఫేవరెట్‌ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు సునీల్‌ గవాస్కర్‌.

 ఇది చూసి ‘సచిన్‌లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్‌ తెందూల్కర్‌. నిజానికి ఈ రైల్వేస్టేషన్‌కి ‘సచిన్‌’ అనే పేరు సచిన్‌ తెందూల్కర్‌ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్‌ తెందూల్కర్‌ పేరుకు, ఈ రైల్వేస్టేషన్‌ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా  కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top