జోష్
సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎప్పుడూ గంభీరంగానే ఉండాలనే రూలేమీ లేదు. సరదా సరదాగా ఉండవచ్చు... హాయిగా డ్యాన్స్ చేయవచ్చు. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్, రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి బెంగళూరులోని పెళ్లి ఊరేగింపులో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.
బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో జరిగిన కిరణ్ మజుందార్ బంధువు వివాహ వేడుకకు ఎంతోమంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరైనప్పటికీ సుధామూర్తి, కిరణ్ మజుందార్ డ్యాన్స్ సెప్స్ వేడుకకు హైలెట్‌గా నిలిచాయి.
‘ఎంత పెద్దలైనా డ్యాన్స్ మొదలు పెడితే చిన్న పిల్లలై΄ోతారు. నృత్యం గొప్పదనం అదే!’ ‘ఇది సుధామూర్తిగారి తీన్మార్!’.... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. గతంలో... ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మణిరత్నం ‘గురు’ సినిమాలోని ‘బర్సోరే’ పాటకు సుధామూర్తి సెప్పులు వేసి ‘ఆహా’ అనిపించారు.


