కొంబుచా హెల్త్‌ డ్రింక్‌! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే! | Sakshi
Sakshi News home page

kombucha Drink: కొంబుచా హెల్త్‌ డ్రింక్‌! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!

Published Fri, Aug 4 2023 5:16 PM

Study Shows Kombucha Drink It Could Ease Diabetes  - Sakshi

కొంబుచా అనేది టీ, ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెరతో కలిసి తయారు చేసే పానీయం. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్తరకం డ్రింక్‌. మధుమేహం వ్యక్తులకు ఇది చక్కటి దివ్యౌషధం. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలను చూసి పరిశోధకులు సైతం ఫిదా అయ్యారు. ఇంతకీ కొంబుచా అంటే ఏమిటి? దీన్ని ఎవరూ తయారు చేశారు?..అంటే..

ఈ డ్రింక్‌ రెండు వేల ఏళ్లక్రితం నాటిది. తొలిసారిగా చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి జపాన్‌, రష్యా దేశాలకు పాకింది. 20వ శతాబ్దంలో యూరోపియన్‌ దేశాలతో సహా అమెరికాలో‍ కూడా దీనికి విశేష ప్రజాధరణ లభించింది. ఇందులో ప్రాథమిక పదార్థాలు ఈస్ట్‌, చక్కెర, బ్లాక్‌ టీ. వీటన్నింట్ల మిశ్రమాన్ని ఒక వారం పాటు నిల్వ ఉంచగా పులియబెట్టిన ఒక ఆమ్లం తయారవుతుంది. ఈ ప్రక్రియను కిణ్వణ ప్రక్రియ అంటారు.

డ్రింక్‌ ఎలా తయారు చేస్తారంటే..
కొంబుచా టీని వివిధ మార్గాల్లో తయారు చేస్తారు, అయితే కొంబుచా తయారీలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక పదార్థాలు ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీ. వీటన్నింటి మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు పులియబెట్టేందుకు అలా వదిలేస్తారు. దీన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. దీనిలో ఉండే ఈస్ట్‌, బ్యాక్టీరియా కొన్ని రకాలు ఆమ్లాలు విడుదల అయ్యి పైన ఒక పొరలాంటిది ఏర్పడుతుంది. ఈ పొరను పక్కకు ఉంచి అందులో ఉన్న పానీయాన్ని సేవిస్తారు. ఈ పొరనే కొంబుచా అంటారు దీన్ని పక్కకు ఉంచుకుని దీని సాయంతో డ్రింక్‌ తయారు చేసుకుంటారు. ఇది తియ్యటి ఆల్కహాల్‌ మాదిరి ఉంటుంది. ఇందులో ఆల్కహాల్‌ కంటెంట్‌ చాలా తక్కువుగా ఉంటుంది. 

డైలీ  డ్రింక్‌ తయారీ విధానం: పెద్ద గాజు సీసా తీసుకోండి. ఒకటిన్నర కప్పుల చక్కెరను రెండు కప్పుల నీటిలో వేసి స్టవ్‌ మీద పెట్టాలి. చక్కెర బాగా కరిగాక రెండు టేబుల​ స్పూన్ల బ్లాక్‌ టీ వేసి పది నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఆఫ్‌ కప్‌ వెనిగర్‌ వేయాలి. ఈ నీటిని మనం పైన చెప్పనట్లుగా తయారు చేసకుని పక్కకు పెట్టుకున్న కొంబుచా పొరలో వేసేసి అలా సుమారు 15 నుంచి 20 రోజు చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. దీన్ని ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అంత తియ్యగా రుచిగా ఉండే కొంబుచా డ్రింక్‌ తయారవుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఈ కొంబుచాలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. టైప్‌2 డయాబెటీస్‌ పేషంట్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ కొంబుచా డ్రింక్‌ జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది.
  • రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుతుంది
  •  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 
  •  పులియబెట్టిన డ్రింక్‌ కావడం చేత క్యాన్సని క్యూర్‌ అ‍య్యేలా చేస్తుంది
  • అలాగే ఎయిడ్స్‌ పేషంట్లకు వ్యాధి నియంత్రణలో ఉండి మరింతకాలం బతికే అవకాశం ఉంటుంది.
  • ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తికి సహాయపడటమేగాక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  • పేగు సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.

అలాగే జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం జరిపిన క్లినకల్‌ ట్రయల్స్‌లో ఈ కొంబుచా డ్రింక్‌ని సేవించిని నాలుగు వారాల తర్వాత ఆయ వ్యక్తుల రక్తంలో సగటున ఉండే గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్‌కు 164 నుంచి 116 మిల్లీగ్రాములకు తగ్గినట్లు వెల్లడైంది. ఎలుకలపై జరిపిన అధ్యయనాల్లో కూడా ఇది నిరూపితమైందని అందువల్ల ఇది శరీరానికి తక్షణ రోగ నిరోధక శక్తి అందించడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధంగా పేర్కొన్నారు. ఐతే కొందరూ మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఆరోగ్యప్రయోజనాలను అందించగలదని నిరూపితమవ్వలేదంటూ వాదించడం గమనార్హం. 

(చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రదాన కారణమా! వెలుగులోకి విస్తూపోయే నిజాలు!)

Advertisement
 
Advertisement