ఇడ్లీ హై జపానీ... టేస్ట్‌ హై హిందుస్థానీ

South Indian Restaurant Run By Japanese People In Kyoto - Sakshi

వైరల్‌

‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం  కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్‌. ఈ ట్విట్టర్‌ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు.

ఈ రెస్టారెంట్‌ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్‌ ఉంది. అయితే ఈ రెస్టారెంట్‌ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు.

‘దోశ అండ్‌ ఇడ్లీ అన్‌బిలీవబుల్‌ అథెంటిక్‌. రెస్టారెంట్‌లో భారతీయుల కంటే జపాన్‌ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్‌–స్టిక్స్‌ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్‌ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్‌ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్‌–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’  అని ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టాడు కార్తిక్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top