రాజధాని టెహ్రాన్‌లో నిరసనలు మిన్నంటాయి. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా లక్ష మందికి పైగా ఇరానీయులు వీధుల్లోకి పోటెత్తారు. ఇరాన్‌లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం.. పాలకులకు వ్యతిరేకంగా మారింది. దీంతో పరిస్థితులు నానాటికి మరింత దిగజారుతున్నాయి.
ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్‌లోని 'గ్రాండ్ బజార్' నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వందలాది నగరాలకు పాకాయి. నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌లో మూడు వారాలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అనేక నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
BREAKING: Massive protests erupt in Tehran, over 100,000 Iranians flooding the streets, demanding the fall of the Islamic Republic. pic.twitter.com/I8Z60fNab6
— Hananya Naftali (@HananyaNaftali) January 28, 2026


