రోజూ లిప్‌స్టిక్‌ వాడుతున్నారా? ఇందులోని కెమికల్స్‌, ప్రిజర్వేటివ్స్‌ వల్ల.. | Sakshi
Sakshi News home page

Lipsticks: రోజూ లిప్‌స్టిక్‌ వాడుతున్నారా?.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి మీకు తెలుసా?

Published Tue, Jun 27 2023 11:00 AM

Side Effects Of Wearing Lipstick Regularly - Sakshi

అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల వస్తువులు వాడుతుంటారు. ముఖ్యంగా కాస్మొటిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.వాటికోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. బ్యూటీ ఉత్పత్తులపై రోజూ కొన్ని కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంటుంది. అందులో ఒకటి లిప్‌స్టిక్‌. ఈరోజుల్లో లిప్‌స్టిక్‌ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొంతమంది  అమ్మాయిలు అయితే లిప్‌స్టిక్‌ లేనిదే కాలు కూడా బయట పెట్టరు.

లిప్‌స్టిక్‌ లేకుండా అసలు మేకప్‌ పూర్తి అవదు. ముఖాన్ని మరింత కాంతివంతంగా, అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్‌ వాడుతుంటారు. కొందరైతే డ్రెస్‌ కలర్‌కి తగ్గట్లు రకరకాల లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే అందాన్ని పెంచే లిప్‌స్టిక్స్‌ రోజూ వాడితే ప్రమాదం పొంచిఉన్నట్లే..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత మనం ఏదైనా తిన్నా, తాగినా ఎంతోకొంత మన నోట్లోకి వెళుతుంది. లిప్‌స్టిక్‌లలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి.


♦ లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం,క్రోమియం,కాడ్మియం వంటి హానికారమైన పదార్థాలు అనేక విధాలుగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

♦ ముఖ్యంగా లిప్‌స్టిక్‌లోని అల్యూమినియం పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది.లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి స్థాయిని తగ్గిస్తుంది. 

♦ అరుదైన సందర్భాల్లో, లిప్‌స్టిక్‌ వల్ల కళ్ల కింద దురద, ఉక్కిరిబిక్కిరి చేయడం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


♦ లిప్‌స్టిక్స్‌లో వాడే సీసం వల్ల హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వస్తాయి.


♦ బిస్మత్ ఆక్సిక్లోరైడ్‌ను లిప్‌స్టిక్‌లో ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల అలర్జీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

♦ కొన్ని చవక లిప్‌స్టిక్‌లను వాడితే చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ లిప్‌స్టిక్స్‌ వాడాలనుకునేవారు ఖరీధైన, హెర్బల్‌ ఉత్పత్తులను వాడితే మంచిది. 

లిప్‌స్టిక్స్‌ వాడేముందు ఇలా చేయండి..
► కొంద‌రు తెలిసో తెలియ‌క‌నో డైరెక్ట్‌గా లిప్స్‌కు లిప్‌స్టిక్‌ను వేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ముందుగా లిప్‌బామ్‌ రాసుకొని దానిపైన లిప్‌స్టిక్‌ వాడాలి.
► లిప్‌బామ్‌ అందుబాటులో లేకపోతే పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె లాంటివి కూడా వాడొచ్చు. 
► లిప్‌స్టిక్స్‌ ప్రతిరోజూ వాడటం వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. అందువల్ల పాలతో ర‌బ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి.
► పడుకునేముందు కశ్చితంగా లిప్‌స్టిక్‌ను తొలగించిన తర్వాతే నిద్రపోవాలి. లేదంటే లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్‌ పెదాలను డ్యామేజ్‌ చేస్తాయి.
►  పెదాలు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదా పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది

Advertisement
 

తప్పక చదవండి

Advertisement