
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్‌లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్‌కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు.
‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్‌కు నచ్చిన కవితాపంక్తులు...
‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు.
నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది.
మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను.
అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’