ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా? | Reason Behind Why Should Eat More Oranges During Winter Season - Sakshi
Sakshi News home page

ఖాళీ కడుపుతో నారింజ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

Published Sat, Dec 30 2023 11:05 AM

Reasons To Eat More Oranges In The Winter Season - Sakshi

చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బొంగురుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే చలికాలంలో రోజూ పండ్లు తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదీ పుల్లటి నారింజ పండు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అదెలాగో చూద్దామా..

అసలే చలికాలం కదా... నారింజ తింటే జలుబు వస్తుందనే భయంతో ఎక్కువ మంది తినడం లేదు. అయితే చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు–దగ్గు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో కఫం ఉంటే నారింజ మీకు ఔషధం.శీతాకాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి నారింజలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్‌ సి శరీరం లోపల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ రెండు నారింజలను తింటే, మీ రోజువారీ మోతాదుకు తగ్గ విటమిన్‌ సి లభిస్తుంది. ఫలితంగా శరీరం లోపల బలం పెరుగుతుంది. ఇది కాకుండా, నారింజలో యాంటీ ఆక్సిడెంట్‌  యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ శరీరంలో మంట లేదా ఇన్ఫెక్షన్‌ వంటి వాటికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నారింజ పండ్లను తినడం వల్ల ముఖం, ముఖంపై ఉండే మొటిమలు మాయమవుతాయి.

ఇది శరీరాన్ని ఎక్కువసేపు తేమగా ఉంచుతుంది. ముఖంపై పగుళ్లు, పొడిబారడం వంటి సమస్యలను ఇది సరిచేస్తుంది. నారింజ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది మీ శరీరంలో ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మధ్యాహ్నం పూట ఈ పండును తినడం మంచిది. అయితే మంచిది కదా అని రోజుకు రెండు పండ్ల కంటే ఎక్కువ తినకూడదు. అలా తినడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. 

Advertisement
Advertisement