
ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే గోల్డ్‌మాన్ శాక్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా తనదైన ప్రత్యేకతను నిలుపు కుంది రమ్య జోసెఫ్ (Ramya Joseph). ‘పెఫిన్’ (Pefin) పేరుతో ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ స్టార్ట్ చేసి విజయపథంలో దూసుకుపోతుంది.
కొలంబియా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ చేసింది రమ్య.చదువు పూర్తయిన తరువాత మల్టీనేషనల్ ఫైనాల్సియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థ ‘ది బ్రిడ్జ్ ; ప్రాజెక్ట్’ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసింది. ‘ది బ్రిడ్జ్’లో ఆటోమేషన్, ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం పూర్తిస్థాయి టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది.
రిటైర్‌మెంట్ తరువాత తన తల్లిదండ్రుల ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు రమ్యకు ‘పెఫిన్’ ఆలోచన వచ్చింది. ‘పర్సనల్ ఫెనాన్స్ ఇంటెలిజెన్స్’ను ‘పెఫిన్’గా సంక్షిప్తీకరించింది.
‘ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మా ΄్లాట్‌ఫామ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కస్టమర్‌లకు ఉపకరించే పర్సనలైజ్‌డ్, యాక్షనబుల్ ΄్లానింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలను అందిస్తాం’ అంటుంది రమ్య.
ఏఐ–ఆధారిత పర్సనల్ ఫైనాన్స్ సెగ్మెంట్‌కు యువతలో మంచి ఆదరణ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం జెన్–జెడ్, మిలీనియల్స్‌లో 41 శాతం మంది ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ఏఐ సలహాలు తీసుకుంటున్నారు.
‘ఎంతైనా రోబో సలహాలే కదా!’ అని ఏఐ బేస్డ్ టెక్నాలజీ గురించి తక్కువ చేసి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని...
‘మా సర్వీస్ సింపుల్‌గా, సులభంగా ఉంటుంది. ఎలాంటి గందరగోళమూ ఉండదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది’ అంటుంది రమ్య.
వెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో రోబో అడ్వైజర్‌లు మేజర్ ట్రెండ్‌గా మారారు. అయితే ‘పెఫిన్’ వాటి కంటే భిన్నమైంది అంటుంది రమ్య. ‘కస్టమర్‌లకు సంబంధించిన మూడు నెలల స్పెండింగ్ డేటా తీసుకుంటుంది పెఫిన్. కస్టమర్‌ల అభిరుచుల గురించి తెలుసుకొని ఏది సరిౖయెనదో, ఏది కాదో సూచిస్తుంది. మా నెట్‌వర్క్ కస్టమర్‌ల సందేహాలను తీర్చి ఎన్నో సలహాలు ఇస్తుంది. సరిౖయెన దారి చూపుతుంది’ అంటుంది రమ్య.ఆర్థిక విషయాల గురించి మరింత అవగాహన కలిగించడానికి కస్టమర్‌లకు కంటెంట్ కూడా పంపుతుంది పెఫిన్.
నా తల్లిదండ్రులు రిటైర్‌మైంట్‌కు దగ్గరలో ఉన్నప్పుడు, వారి ఆర్థికభద్రతకు సంబంధించి రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఆలోచన వచ్చింది. నేను రిటైర్ కావాలను కుంటున్నాను... అని ఎవరైనా అన్నప్పుడు వారికి సరిౖయెన దారి కనిపించదు. ఒకవేళ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవాలనుకుంటే అది ఖర్చుతో కూడిన పని. ఈ నేపథ్యంలో పెఫిన్ అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. – రమ్య జోసెఫ్
ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే