మష్రూమ్‌ పెప్పర్‌ ఫ్రై.. స్నికెర్‌ డూడుల్‌ కుకీస్‌ | Preparation Method For Mushroom Pepper Fry And Other Dishes | Sakshi
Sakshi News home page

మష్రూమ్‌ పెప్పర్‌ ఫ్రై.. స్నికెర్‌ డూడుల్‌ కుకీస్‌

Jun 21 2026 12:48 PM | Updated on Jun 21 2026 12:48 PM

Preparation Method For Mushroom Pepper Fry And Other Dishes

ప్రతిరోజూ ఒకే రకమైన వంట తిని ఇబ్బంది పడుతున్నారా! అయితే కొత్త వంటకాలు ఏం చేయాలి? ఎలా చేయాలనుకునే వారు వీటిని ప్రయత్నించండి..

మష్రూమ్‌ పెప్పర్‌  ఫ్రై

కావలసినవి:
మిరియాలు: టేబుల్‌ స్పూన్
సోంపు: 1/2 టీస్పూన్
జీలకర్ర: 1/2 టీస్పూన్
ధనియాలు: 1/2 టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్‌ స్పూన్లు
ఆవాలు: టీస్పూన్
ఎండు మిర్చి: 2, కరివేపాకు: కొద్దిగా
అల్లం: ఇంచ్‌ ముక్క (సన్నగా తరిగినది)
ఉల్లిపాయ: తరిగినది
పుట్టగొడుగులు: 300 గ్రాములు (ముక్కలుగా కోసినవి)
క్యాప్సికమ్‌: సగం (తరిగినది)
ఉప్పు: రుచికి సరిపడా.

తయారీ:

  • ముందుగా ఒక చిన్న మిక్సీ జార్‌ తీసుకుని అందులో మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు వేయాలి.

  • నీళ్లు పోయకుండా, దీనిని బరకగా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో నెయ్యి వేసి; ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.

  • పోపు వేగాక, అందులో అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.

  • ఆ తర్వాత కడిగి ముక్కలుగా కోసుకున్న పుట్టగొడుగులను కడాయిలో వేసి, మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి.

  • మష్రూమ్స్‌ వేగాక అందులో క్యాప్సికమ్‌ ముక్కలను కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే çకలుపుతూ వేయించాలి.

  • చివరగా, మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పెప్పర్‌ మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.

  • మసాలా అంతా మష్రూమ్‌ ముక్కలకు బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి.

  • మసాలా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన మష్రూమ్‌ పెప్పర్‌ ఫ్రై సిద్ధం.

స్నికెర్‌ డూడుల్‌ కుకీస్‌
కావలసినవి:
మైదాపిండి: రెండు ముప్పావు కప్పులు
వెన్న: కప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పులు
గుడ్లు: 2, వెనీలా ఎసెన్స్‌: టీస్పూన్
క్రీమ్‌ ఆఫ్‌ టార్టార్‌: 2 టీస్పూన్లు
బేకింగ్‌ సోడా: టీస్పూన్
ఉప్పు: పావు టీస్పూన్
పంచదార: పావు కప్పు
దాల్చినచెక్క పొడి: ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.

తయారీ:

  • ఒక గిన్నెలో మైదా పిండి, క్రీమ్‌ ఆఫ్‌ టార్టార్, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

  • మరొక పెద్ద గిన్నెలో మెత్తటి వెన్న, చక్కెర వేసి బ్లెండర్‌ లేదా స్పూ¯Œ తో బాగా కలపాలి.

  • ఇది సాఫ్ట్‌గా, క్రీమ్‌లా మారే వరకు బ్లెండ్‌ చేయాలి. ఆ తర్వాత ఇందులో రెండు గుడ్లు, వెనీలా ఎసె¯Œ ్స వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి.

  • ఇప్పుడు ఈ వెన్న మిశ్రమంలో, ముందుగా సిద్ధం చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి.

  • ఆ తరువాత ఒక చిన్న ప్లేట్‌లో కోటింగ్‌ కోసం ఉంచిన పావు కప్పు చక్కెర, దాల్చినచెక్క పొడి  వేసి బాగా మిక్స్‌ చేయాలి.

  • తయారు చేసుకున్న పిండిని చిన్నగా గుండ్రని బాల్స్‌లా చుట్టుకోవాలి.

  • ఈ బాల్స్‌ను దాల్చినచెక్క– చక్కెర మిశ్రమంలో వేసి, చుట్టూ ఆ పొడి బాగా అంటుకునేలా దొర్లించాలి.

  • ఇలా సిద్ధం చేసిన బాల్స్‌ను బేకింగ్‌ ట్రేపై సర్దాలి. వీటిని ప్రిహీట్‌ చేసిన ఓవె¯Œ లో 8 నుంచి 10 నిమిషాల పాటు బేక్‌ చేయాలి.

  • కుకీల అంచులు లైట్‌గా గోల్డెన్‌ కలర్‌లోకి రాగానే ఓవెన్‌ నుంచి తీసేయాలి. అంతే! ఎంతో సువాసనభరితమైన, నోట్లో వేస్తే కరిగిపోయే సాఫ్ట్‌ స్నికెర్‌ డూడుల్‌ కుకీస్‌ రెడీ! 

కేరళ అరి పతిరి..
కావలసినవి:
బియ్యప్పిండి: కప్పు
నీళ్లు: ఒకటింపావు కప్పు
కొబ్బరి నూనె: టీస్పూన్
ఉప్పు: అర టీస్పూన్
పొడి బియ్యప్పిండి: కొద్దిగా.


తయారీ:

  • స్టవ్‌ మీద ఒక పాన్‌ పెట్టి అందులో బియ్యప్పిండి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు డ్రై రోస్ట్‌ చేసి పెట్టుకోవాలి.

  • ఆ తరువాత ఒక పెద్ద కడాయిలో ఒకటింపావు కప్పుల నీళ్లు, టీస్పూన్‌ కొబ్బరి నూనె, అర టీస్పూన్‌ ఉప్పు వేయాలి.

  • నీరు బాగా మరిగాక ఇందులో వేయించి పెట్టుకున్న బియ్యప్పిండిని వేయాలి.

  • ఉండలు కట్టకుండా వెంటవెంటనే కలుపుతూ ఉండాలి. పిండి నీటిని పీల్చుకుని ముద్దలా అయ్యే వరకు కలపాలి.

  • ఇప్పుడు స్టవ్‌ ఆపేసి, గిన్నెపై మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.

  • ఆ వేడి ఆవిరికే పిండి మరింత మెత్తగా ఉడుకుతుంది. పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులకు నూనె రాసుకుని పిండిని బాగా మెత్తగా, సాఫ్ట్‌గా అయ్యే వరకు చపాతీ పిండిలా ఒత్తాలి.

  • ఆ పిండి నుంచి చిన్న పిండి ముద్దలను చేసుకోవాలి. ఆ తరువాత చపాతీ పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లి, ఒక పిండి ముద్దను తీసుకుని వీలైనంత పల్చగా రొట్టెలా చేసుకోవాలి.

  • చివరగా స్టవ్‌ మీద నాన్‌–స్టిక్‌ పెనం పెట్టి, చేసి పెట్టుకున్న పతిరిని పెనంపై వేసి, రెండు వైపులా 30 సెకన్ల పాటు మాత్రమే కాల్చాలి. అంతే కేరళ అరి పతిరి రెడీ! వీటిని పంచదార కలిపిన ఫ్రెష్‌ కొబ్బరి పాలలో ముంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement