
తెల్లజుట్టు వృద్ధాప్యానికి సూచిక. కాని, వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు 20 దాటి 30లోకి అడుగుపెట్టేలోపే జుట్టు పండి΄ోతోంది. ఇటీవలి కాలంలో యువతరంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోందంటున్నారు నిపుణులు. అకాలంలో జుట్టు నెరిసిపోవడాన్ని ‘కానిటీస్’ అని అంటారు. దీనికి ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులతోపాటు ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. తలలో పేనుకొరుకుడు సమస్య తీవ్రమవుతున్నప్పుడు, థైరాయిడ్ ఎక్కువవుతున్నప్పుడు కూడా తెల్లజుట్టు వచ్చే అవకాశం ఉంటుంది.
ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. నలుపు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. దాంతో చిన్న వయసులోనే తల నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, పట్టణ జీవనశైలి కూడా ఈ పరిస్థితి కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు.
ఐరన్, కాపర్, విటమిన్ బి12 లోపంతో తెల్లజుట్టు విపరీతంగా పెరుగుతుంది. మరి యుక్తవయసులో వచ్చిన తెల్లజుట్టు తగ్గుతుందా? ఇదే ప్రశ్న నిపుణులను అడిగితే తగ్గుతుందనే అంటున్నారు. థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవడం, సక్రమంగా సమయానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు.
(చదవండి: బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?)