ఈ యానిమేటెడ్‌ కామెడీ సిరీస్‌.. జోకులేస్తూ..! జోస్యం చెబుతూ!! | Popular Animation Series The Simpsons Prediction I Am Proud To Be A Part Of It | Sakshi
Sakshi News home page

ఈ యానిమేటెడ్‌ కామెడీ సిరీస్‌.. జోకులేస్తూ..! జోస్యం చెబుతూ!!

Aug 16 2024 10:17 AM | Updated on Aug 16 2024 11:06 AM

Popular Animation Series The Simpsons Prediction I Am Proud To Be A Part Of It

సమ్‌థింగ్‌ స్పెషల్‌

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు’ అంటూ ‘లవకుశ’ పాట గుర్తుకొచ్చినా సరే, ఊహించడం కష్టమేమీ కాదు అంటుంది ది సింప్సన్‌. ఆర్థిక, సామాజిక. సాంస్కృతిక... ఇలా పలురంగాలకు సంబంధించిన భవిష్యత్‌ పరిణామాలను ప్రసిద్ధ యానిమేషన్‌ సిరీస్‌ ‘ది సింప్సన్‌’ ఊహించింది. గతంలో ఊహించిన వాటిలో కొన్ని నిజం అయ్యాయి.

‘ది సింప్సన్‌’  ఊహించిన వాటిలో కొన్ని నిజం కావడంతో ‘సింప్సన్‌’ మోడ్రన్‌ నోస్ట్రడామస్‌గా పేరు తెచ్చుకుంది. ఈ యానిమేటెడ్‌ కామెడీ సిరీస్‌ అమెరికన్‌ సాంస్కృతిక, సామాజిక  పరిణామాలపై  హాస్యంతో కూడిక వ్యాఖ్యానాలు చేయడమే కాదు జోస్యం కూడా చెబుతుంటుంది.

2000 సంవత్సరంలో ప్రసారమైన 11వ సీజన్‌లోని 17వ ఎపిసోడ్‌లో లీసా సింప్సన్‌ యూఎస్‌ మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డ్‌ సృష్టిస్తుంది. ‘ఆ ప్రెసిడెంట్‌ ఎవరో కాదు కమలా హారిసే’ అంటున్నారు ఇప్పుడు చాలామంది. టీవీ సిరీస్‌లోని అమెరికా ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ ధరించే దుస్తులను పోలిన దుస్తులలో(ప్యాంట్‌స్యూట్‌) కనిపిస్తుంది. మెడలో ముత్యాల నెక్లస్‌...సేమ్‌ టు సేమ్‌!  కమలా హారిస్‌ను అలనాడే డెమోక్రాట్‌ అభ్యర్థిగా ప్రిడిక్ట్‌ చేయడంపై ‘ది సింప్సన్‌’ షో రైటర్, ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌ ఏఐ జీన్‌ గర్వంగా ఫీలవుతూ ‘ది సింప్సన్స్‌ ప్రిడిక్షన్‌. ఐయామ్‌ ప్రౌడ్‌ టు బీ ఏ పార్ట్‌ ఆఫ్‌’ అంటూ పోస్ట్‌ చేశాడు. ‘ఈ పదవిని గతంలో ఒక రియల్‌ ఎస్టేట్‌ మొఘల్‌ నిర్వహించాడు’ అనే మాట ఈ ఎపిసోడ్‌లో వినిపిస్తుంది. గతంలో అమెరికా అ«ధ్యక్షుడిగా పని చేసిన డోనాల్డ్‌  ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ మొఘల్‌ కావడం గమనార్హం.

‘ఇలా జరగనుంది’ అని సింప్సన్‌ వ్యంగ్యంగానో, సూచన్రపాయంగానో చెప్పిన విషయాలు కొన్ని నిజం అయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న వారు అమెరికా అధ్యక్ష బరిలోకి వస్తారని, స్మార్ట్‌ వాచ్‌ల వినియోగం బాగా పెరుగుతుందని, ట్వంటీయత్‌ సెంచరి ఫాక్స్‌ను డిస్నీ కొనుగోలు చేస్తుందని, ఆర్థికవేత్త బెంగ్‌ ఆర్‌ హోమ్‌స్ట్రోమ్‌ నోబెల్‌ బహుమతి గెలుచుకుంటాడని...ఇలాంటి అంచనాలు నిజం అయ్యాయి. మరికొన్ని....

– రిచర్డ్‌ బ్రాన్సన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ (2021) ని 2015 సంవత్సరంలో  సీజన్‌ 25, ఎపిసోడ్‌ 15లో ప్రిడిక్ట్‌ చేశారు.
– జనవరి 6, 2021లో జరిగిన యూఎస్‌ క్యాపిటల్‌ అల్లర్లకు సంబంధించిన దృశ్యం 1996లో వచ్చిన సీజన్‌ 7, ఎపిసోడ్‌ 18 (ది డే ది వయోలెన్స్‌ డైడ్‌)లో కనిపిస్తుంది.
– 2003లో జరిగిన ఒక లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌లో సిగ్‌ఫ్రీడ్, రాయ్‌ అనే మ్యాజిషియన్‌లపై పులి దాడి చేసింది. 1993లో ప్రసారమైన సీజన్‌ 5, ఎపిసోడ్‌ 10లో ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది.
– యూఎస్‌ మెన్‌ కర్లింగ్‌ టీమ్‌ 2018లో వింటర్‌ ఒలింపిక్స్‌లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయాన్ని సీజన్‌ 21, ఎపిసోడ్‌ 12లోనే ఊహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement