ఏఐ ఫిట్‌నెస్‌ యాప్స్‌ని నమ్మొచ్చా? | Personalized Workout Plans Artificial Intelligence Fitness Apps | Sakshi
Sakshi News home page

ఏఐ ఫిట్‌నెస్‌ యాప్స్‌ని నమ్మొచ్చా?

Jul 4 2026 10:04 AM | Updated on Jul 4 2026 10:13 AM

Personalized Workout Plans Artificial Intelligence Fitness Apps

అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్‌కి ప్రత్యామ్నాయం కాలేవు

సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్‌నెస్‌ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్‌స్టైల్‌ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్‌ వర్కవుట్‌ ప్లాన్స్‌ ఇవ్వడం, న్యూట్రిషన్‌ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్‌ చేస్తూ రియల్‌–టైమ్‌ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్‌ సరికొత్త ట్రెండ్‌ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్‌నెస్‌ యాప్స్‌తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

ఏఐ యాప్స్‌ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్‌ కోచ్‌ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్‌లిఫ్ట్‌ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్‌నెస్‌ కోచ్‌ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్‌ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్‌ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్‌గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ సలహా తీసుకోవాల్సిందే.

ఫోన్‌ లో సులభంగా ఫిట్‌నెస్‌ ప్లాన్‌ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్‌నెస్‌ యాప్స్‌ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్‌కి ప్రత్యామ్నాయం కాలేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement