
కీర్తిశేషులతోకమ్యూనికేషన్
అబ్బు: ఏరా సుబ్బూ... ఎలా ఉన్నావు?
సుబ్బు: నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటానురా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే...
అబ్బు: అది సరే. భూలోక విశేషాలు ఏంటీ? కొత్త బైక్ కొన్నావా? ఇంకా ఆ డొక్కు బైకే వాడుతున్నావా(నవ్వు)
గమనిక: అబ్బు రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుబ్బు తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.
మరి వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారు?
అదంతా ‘గ్రీఫ్‌బాట్స్’ మహిమ!
‘గ్రీఫ్‌బాట్స్’ (Griefbots) లేదా ‘డెట్‌బాట్స్’ (deadbots) అనే ఏఐ(AI) స్టార్టప్‌లు చనిపోయిన వ్యక్తి ప్రతిరూపాన్ని సృష్టించడమే కాదు వారితో మాట్లాడిస్తాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్‌ఎల్‌ఎం)లు చనిపోయిన వారి మాటతీరు, హావభావాలను అచ్చంగా అనుకరిస్తాయి.
ప్రాజెక్ట్ డిసెంబర్, స్టోరీ ఫైల్, అండ్ యూ, వోన్లీ వర్చువల్... మొదలైన స్టార్టప్‌లు చనిపోయిన జీవిత భాగస్వామి, ఫ్రెండ్, బం«ధువు... ఇలా ఎంతోమంది ఏఐ అవతార్‌లతో మాట్లాడించే టూల్స్‌పై దృష్టి పెట్టాయి. దీనికోసం ప్రైవేట్ డాటాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నాయి. (Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!)
జస్టిన్ హారిసన్ స్టార్టప్ ‘అండ్ యూ’ యూజర్‌లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్టార్టప్ సృష్టించిన ఏఐ–పవర్డ్ ఆడియో వెర్షన్స్ ద్వారా చని΄ోయిన వారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు (అంటే... అవతలి వ్యక్తి గొంతు అచ్చం చనిపోయిన వ్యక్తి గొంతును ΄ోలి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడతారు!)
‘అమ్మా, నాన్న లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వారిచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడేవి... ఇలా చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకొని బాధ పడేవారు బోలెడు మంది ఉంటారు. అలాంటి వారికి మేము సృష్టించిన సాంకేతికత ఎంతో ఊరట ఇస్తుంది’ అంటున్నాడు జస్టిన్ హరిసన్.
చనిపోయిన వారితో ‘జూమ్ కాల్’లాంటి సంభాషణలు చేయడానికి వీలు కల్పించే సాంకేతికతను యూజర్‌లకు అందిస్తోంది ‘స్టోరీ ఫైల్’ స్టార్టప్. కీర్తిశేషుల ఏఐ అవతార్‌లు కొందరికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఆత్మీయులకు ఊరట ఇస్తున్నప్పటికీ ‘గ్రీఫ్‌బాట్స్’ స్టార్టప్‌లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.