భాగ్యనగరంలో అందాల హడావిడి..! | Miss World 2025: Beauties From Nearly 120 Countries Arriving In Hyderabad | Sakshi
Sakshi News home page

అందాల తారల ఆగమనం..

May 5 2025 9:39 AM | Updated on May 6 2025 12:07 PM

Miss World 2025: Beauties From Nearly 120 Countries Arriving In Hyderabad

హైదరాబాద్‌ నగర వేదికగా జరగనున్న 72వ ప్రపంచ సుందరి పోటీల కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 120 దేశాలకు చెందిన అందాల భామలు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్‌ వరల్డ్‌ సీఈవో, చైర్‌ పర్సన్‌ జూలియా ఈవేలిన్‌ మోర్లి, మిస్‌ కెనడా మిస్‌ ఎమ్మా డయన్నా క్యాథరీన్‌ మొర్రిసన్‌ వంటి ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. 

కాగా ఆదివారం మిస్‌ బ్రెజిల్‌ జెస్సికా స్కాన్డియుజ్జి పెడ్రోసో, మిస్‌ సౌత్‌ ఆఫ్రికా జోయలైజ్‌ జాన్సెన్‌ వాన్‌ రెన్స్‌బర్గ్‌ నగరానికి చేరుకున్నారు. నగరంలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కి చేరుకున్న మిస్‌ బ్రెజిల్‌ జెస్సికా, మిస్‌ సౌత్‌ ఆఫ్రికా జోయలైజ్‌కు భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యాలతో జెస్సికాను, జోయలైజ్‌ను ఆహ్వానించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. 

ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్‌ వరల్డ్‌–2025’ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి మరికొందరు సుందరీమణులు ఈనెల 6వ తేదీ వరకూ ఒక్కొక్కరుగా రానున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. 

బాలీవుడ్, హాలీవుడ్‌ ప్రముఖుల సందడి.. 
మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా జరగనున్న ప్రారంభ వేడుకల్లో గ్లోబల్‌ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయనున్నారు. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్, 3 స్టార్‌ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్‌ చేశారు. 

అంతేకాకుండా విమానాశ్రయంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు భారత్‌ నుంచి మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మాజీ మిస్‌ వరల్డ్‌లు సైతం నగరానికి చేరుకోనున్నారు. ఈనెల 10వ తేదీ లోపు బాలీవుడ్, హాలీవుడ్‌ సినీ ప్రముఖులు సైతం ముఖ్య అతిథులుగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)

Advertisement
 
Advertisement
Advertisement