breaking news
beauties
-
తెలుగు ముద్దుగుమ్మల క్యాట్ వాక్.. సాష్ మిస్ యూనివర్స్‌లో సందడి (చిత్రాలు)
-
Miss World 2025: విశ్వ వేదికపై.. నాటు పాట..
అంతర్జాతీయంగా ప్రపంచ సుందరి పోటీలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మిస్ వరల్డ్‌గా భారతీయులు కిరీటం గెలిస్తే గొప్పగా కీర్తించుకున్నాం.. కానీ గతేడాది 71వ మిస్ వరల్డ్ ముంబైలో, ఈ సారి 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ (హైదరాబాద్)లో నిర్వహించడంతో ఇండియా విశిష్టత విశ్వవ్యాప్తమైంది. అయితే ఈ సారి నగరంలో జరుగుతున్న పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు తెలుగు పాటలు సైతం వైరల్‌గా మారాయి. ఏ దేశంలో ఈ పోటీలు జరిగినా ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు రావడం సహజమే. అయితే వినూత్నంగా ఈ సారి తెలుగు పాటలు వైరల్‌గా మారాయి. దీనికి కారణం.. ఈ సారి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు పాటలకు అభిమానులుగా మారడం చెప్పుకోవాల్సిన విషయం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బసచేస్తున్న ట్రైడెంట్ హోటల్ వేదికగా మిస్ నైజీరియా పాడిన ‘రానూ.. బొంబైకి రానూ’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జానపద సాహిత్యంతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్ రాను బొంబైకి రాను..!! తెలంగాణతో పాటు దక్షినాది వరకూ ఫేమస్ కావడం ఓకే.. కానీ ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ పాటను పాడటం, దీనికి స్టెప్పులేయం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ పాట వైరల్ అవ్వడమో లేదా మిస్ నైజీరియాకు తెగ నచ్చేసిందో తెలియదు కానీ.. మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమైన టాలెంట్ రౌండ్లోనూ ఈ ముద్దుగుమ్మ ఇదే పాటకు డ్యాన్స్ వేశారు. వినూత్నంగా ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ అంటూ ఈ తెలుగు పాట, తమ దేశానికి చెందిన పాటలతో తన టాలెంట్ రౌండ్‌ను ప్రదర్శించారు. ఐతే ఇదే రౌండ్ చివరలో 20 దేశాలకు చెందిన టాలెంట్ రౌండ్ ఫైనలిస్టులు మళ్లీ ఇదే పాటకు స్టెప్పులేయడం మరోసారి వైరల్‌గా మారింది. ఇందులో మిస్ ఇండియా నందినీ గుప్తా అదిరిపోయే స్టెప్పులేశారు.. మార్ఫా స్పెషల్.. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మిస్ తారలతో నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ‘హెరిటేజ్ వాక్’ నిర్వహించిన విషయం విధితమే. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన మార్ఫా సంగీతానికి ఈ సుందరీమణులు డ్యాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియోలు తమ సోషల్ మీడియా యాప్స్‌లో పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా తిలకించారు.కుర్చీ మడత పెట్టి.. అందరూ తెలుగు పాటలతో అదరగొడితే.. మిస్ ఇండియా నందినీ గుప్తా మాత్రం సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘కుర్చీ మడత పెట్టి...’ అనే డైలాగ్ కం పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఎలా ఉన్నారూ..?? మరో కార్యక్రమంలో భాగంగా ఈ ముద్దుగుమ్మలంతా తెలంగాణ వారసత్వ వైభవాన్ని, విశిష్టతను తిలకించడానికి వరంగల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ కెనడా.. తెలుగులో ‘నమస్తే.. ఎలా ఉన్నారు’ అని సందడి చేయగా, మిస్ యూఎస్ఏ.. ‘అందరూ బాగున్నారా’ అంటూ పలకరించారు. మిస్ అర్జెంటీనా ఐతే పాన్ ఇండియా ఫేమస్ తెలుగు డైలాగ్ ‘తగ్గేదే లే’ అంటూ అలరించారు. ఈ అందాల తారల నోటి వెంట ముచ్చటగొలిపే ఈ మాటలు సైతం యూట్యూబ్‌లో, సోషల్ యాప్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.బాలీవుడ్ స్వరాలు సైతం.. ఇవే కాకుండా జిలేబి బేబీ, ఓం శాంతి ఓం, ధూమచాలే వంటి బాలీవుడ్ ఇండియన్ బాలీవుడ్ పాటలతోనూ పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు.తీన్మార్.. నగరంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్ ఈవెంట్లో కూడా తెలుగు పాటలకు, తీన్మార్ బ్యాండ్‌కు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. హోర్ట్ ఆఫ్ గోల్డ్ పేరుతో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో సైతం అనాథ చిన్నారులను ఉత్సాహపరచడానికి తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాటతో పాటు డీజే టిల్లూ, ఇడియట్, అద్దాలా మేడలున్నవే అనే తెలుగు పాటలకు డ్యాన్సులు చేసి మరో సారి తెలుగు సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించారు.అందాల బొమ్మ నోట.. బుట్టబొమ్మా పాట..మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ జర్మనీ సైతం మరో తెలుగు పాటతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందాలొలికే ఈ ముద్దుగుమ్మ క్యూట్ క్యూట్ వాయిస్‌తో బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా నను చుట్టూకుంటివే అనే అల్లూ అర్జున్ టాప్ హిట్ సాంగ్ పాడి అందరి మనసులూ దోచుకున్నారు. ఈ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా చుమ్కా కీరా హోయ్ అనే మరో బాలీవుడ్ పాటను సైతం పాడారు. (చదవండి: Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
భాగ్యనగరంలో అందాల హడావిడి..!
హైదరాబాద్ నగర వేదికగా జరగనున్న 72వ ప్రపంచ సుందరి పోటీల కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 120 దేశాలకు చెందిన అందాల భామలు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ వంటి ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. కాగా ఆదివారం మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాన్డియుజ్జి పెడ్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ నగరానికి చేరుకున్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్న మిస్ బ్రెజిల్ జెస్సికా, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్కు భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యాలతో జెస్సికాను, జోయలైజ్ను ఆహ్వానించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్–2025’ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి మరికొందరు సుందరీమణులు ఈనెల 6వ తేదీ వరకూ ఒక్కొక్కరుగా రానున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల సందడి.. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా జరగనున్న ప్రారంభ వేడుకల్లో గ్లోబల్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయనున్నారు. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్ చేశారు. అంతేకాకుండా విమానాశ్రయంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు భారత్ నుంచి మిస్ వరల్డ్‌గా నిలిచిన మాజీ మిస్ వరల్డ్‌లు సైతం నగరానికి చేరుకోనున్నారు. ఈనెల 10వ తేదీ లోపు బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ముఖ్య అతిథులుగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
నార్త్ లేడీస్ టెన్షన్ పెడుతున్న సౌత్ బ్యూటీస్
-
బ్యూటీస్ సెల్ఫీ
-
సొగసు చూడతరమా!
సాక్షి: స్వచ్ఛమైన గాలి, పచ్చదనం నిండిన పరిసరాలు, అలల హోరు, తెల్లటి ఇసుక తెన్నెలు, నిర్మలమైన నీలాకాశం, నీటిలో తేలియాడుతున్నట్లుండే కొండలు, నీటి అడుగు నుంచి పలకరించే జలచరాలు.. హుషారెత్తించే బోటింగ్, థ్రిల్లింగ్ అందించే స్విమ్మింగ్ ఇవన్నీ మిమ్మల్ని మరోలోకానికి తీసుకెళ్తాయి. ఇంతటి వైవిధ్యమైన ప్రకృతి అందాలకు చిరునామా ఫిఫి దీవులు. ఈ దీవుల్లోని ప్రకృతి రమణీయతను ఎంత వర్ణించినా తక్కువే అవుతుందనడం అతిశయోక్తి కాదు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఫిపి దీవుల అందాలు, విశేషాల గురించి తెలుసుకుందామా? ఫిఫి ఐలాండ్స్ ఆరు ద్వీపాల కలయిక. వాటిలో రెండు పెద్ద ద్వీపాలు. మిగిలిన నాలుగు కేవలం బీచ్‌లకు ప్రత్యేకం. ఇవి థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్నాయి. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండటం వల్ల ఇవి మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా సేదతీరడానికి పేరుగాంచిన ఈ దీవులు థాయ్లాండ్లోనే కాక ప్రపంచంలోనే అందమైన దీవులుగా ప్రసిద్ధి చెందాయి. ప్రత్యేక అనుభూతి.. బీచ్ ఒడ్డున ఈత కొట్టే రంగు రంగుల చేపలను చూస్తూ చెక్క కుర్చీలో శీతల పానీయాలు తాగుతూ సేదతీరడం నిజంగానే ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బీచ్‌లను స్వచ్ఛంగా ఉంచడం అంత సులువైన విషయం కాదు. ఆ విషయంలో ఈ బీచ్ నిర్వాహకుల కృషిని అభినందించాల్సిందే. ఇక్కడ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే లోపల తిరుగాడే రంగు రంగుల చేపలు, జలచరాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. రెండే కాలాలు.. లోకానికి మూడు కాలాలుంటే ఈ దీవుల్లో రెండే కాలాలుంటాయి. ఎండాకాలం, వానాకాలం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎండాకాలం. మే నుంచి డిసెంబర్ వరకు వానాకాలం. ఈ ప్రాంతం వానాకాలం సందర్శిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎండా కాలం కూడా మరీ వేడిగా ఉండదు. ఏ కాలమైనా ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉంటాయి. ఇక్కడ కరెన్సీ థాయ్బాట్. మన రెండు రూపాయలు ఒక థాయ్బాట్తో సమానం. కాబట్టి భారతీయులకు థాయ్టూర్ అంత ఖర్చుతోకూడున్నది ఏమీ కాదు. అక్కడకు వెళ్తే టాటూ పడాల్సిందే.. ఫిఫి ఐలాండ్స్ చిన్న ప్రాంతమే అయినా ఒక నగరానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉంటాయి. ఇక్కడ టూర్‌ను చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చు. ఎక్కువ గానూ ఖర్చుచేయొచ్చు. ఇక్కడ టాటూ సెంటర్లు చాలా ఎక్కువ. ఏటీఎం సెంటర్ల మాదిరి ఎక్కడపడితే అక్కడ టాటూ సెంటర్లు కనిపిస్తాయి. ఏ పద్ధతిలో కావాలన్నా, ఏ టాటూ కావాలన్నా నిమిషాల్లో వేసేస్తారు. ఫిఫి వెళ్లొచ్చిన దాదాపు అందరి ఒంటిపైన టాటూలు కనిపిస్తాయి. ప్రానంగ్ టూ ఫిఫి.. ఈ ద్వీపాలు కాబ్రి టౌన్ పరిధిలోకి వస్తాయి. వాటితో పాటు ప్రా నంగ్ బీచ్. పక్కనే ఒక పెద్ద కొండ, దాని మీద వేలాడే ఉద్యానవనాలు.. అన్నీ ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి. తెల్లటి ఇసుకతో ఈ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పుకెట్ నగరం.. థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పుకెట్ నగరం. ఆ దేశ ఏరోప్లేన్ బ్రాండ్ కూడా ఇదే. ఈ నగరం ఫిఫి ఐలాండ్‌కు కేవలం 50 కి.మీ దూరంలో ఉంది. ఇది కూడా థాయ్‌లోని అతిపెద్ద పర్యాటక ప్రదేశమే. ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. థాయ్ సంప్రదాయ దర్శనీయ స్థలాలు ఉన్నాయి. యాచ్ ట్రిప్.. ఈ దీవుల్లో మరో మంచి అనుభూతి యాచ్ట్రిప్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ పొడవాటి పడవలు ఎక్కకుండా తిరిగి వెళ్లరు. వీటిలో ఒక రోజంతా ఆరు దీవులను చుట్టిరావడం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. వీటి ఖరీదు కూడా పెద్ద ఎక్కువ కాదు. వీటిని కొన్ని కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. నడుపుతున్నాయి. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్లు ఎంచుకుని కూడా గైడ్లను వెంటబెట్టుకుని వెళ్లొచ్చు. -
తెలుగులో నయా బ్యూటీస్ హవా!
-
తిరుమల అందాలు