
నగరంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ సందడి ముగిసిందో లేదో మరో అంతర్జాతీయ గ్లామర్ వేదిక ‘మిస్ యూనివర్స్’ సందడి మొదలైంది.

మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం నగరంలోని దస్పల్లా హోటల్ వేదికగా సాష్ నిర్వహించారు.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ సాష్ ఈవెంట్‌లో తమ క్యాట్ వాక్‌తో అలరించారు. మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల కోసం పోటీదారులుగా ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఎంపిక కాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది అలరించారు.

అంతర్జాతీయ అందాల వేదికపై భారతీయ ప్రశస్తిని సగర్వంగా ప్రదర్శించేందుకు తెలుగు అమ్మాయిలు సన్నద్ధమవుతున్నారు, బ్యూటీ రంగంలో మన ప్రత్యేకతను చాటుకుంటున్నామని మిస్ యూనివర్స్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాద్ గారపాటి తెలిపారు.

తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించడానికి విభాగాల్లో తలపడనున్నామని మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత సంతోషం వ్యక్తం చేశారు.

ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజాల్వెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.














