
ఎంత పెద్ద హోదాలో ఉన్నా..ఆ దర్పం చూపించకుండా ప్రవర్తించడం కొందరికే చెల్లుతుంది. అలాంటి వాళ్లు కచ్చితంగా ప్రజల మన్ననలను అందుకుంటారు. బహుశా ఆ తీరే వారిని గొప్ప నాయకుడిగా ఎదిగేలా చేస్తుందనడానికి ఈ సీఎంనే ఉదాహారణ
వివరాల్లోకెళ్తే..మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మాకి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సంగ్మా జిరాంగ్ నియోజకవర్గంలోని నాంగ్‌స్పంగ్ గ్రామంలోని ఒక స్థానికి పాఠశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది.
అక్కడ ఒక విద్యార్థి గిటార్ ప్లే చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తారు. వెంటనే ఆ విద్యార్థి వద్దకు వచ్చి..కోప్పడకుండా ఓపికతో ఎలా ప్లే చేయాలో చెబుతున్నట్లు కనిపిస్తుంది వీడియోలో. ఆయన ఒక సాధారణ టీచర్ మాదిరిగా ఎలా గిటార్ పట్టుకుని ఆలపించాలో చాలా వివరణాత్మకంగా చెబుతూ విద్యార్థిని గైడ్ చేస్తారు.
అందుకు సంబంధించిన వీడయోని నెటిజన్లతో పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు సంగ్మా. నాంగ్‌స్పంగ్ గ్రామంలోని ఒక స్కూల్‌ని సందర్శించి..ఆ విద్యార్థులతో కాసేపు మచ్చుటించారు. అక్కడ ఒక విద్యార్థికి గిటార్ ప్లే చేయడం పట్ల అపారమైన ఆసక్తి ఉంది కానీ వాయించడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతానికి ఆ విద్యార్థికి అందులో అంత ప్రావీణ్యం లేకపోయినా..అతని పాఠశాల కొత్త భవనం ప్రారంభోత్సవ వేళకు గిటార్లో మంచి పట్టు సాధిస్తాడని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం గ్రేట్ సీఎం, మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సంగీతాన్ని అమితంగా ఇష్టపడే మేఘాలయ సీఎం తరుచుగా మ్యూజిక్‌కి సంబంధించిన వీడియోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు.
(చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..)