70 ఏళ్ల నాటి ప్రేమ లేఖ..అది మరో 'సీతారామం' సినిమా!

Lost Love Letter Unearthed In A Toolbox In US - Sakshi

ప్రేమికుల గాథలు ఎన్నో చూశాం. కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విషాదంగా ముగుస్తాయి. ఏదీఏమైనా ప్రేమికులకు సంబంధించిన స్టోరీలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి కథే రసవత్తరంగా తెరపైకి వచ్చింది. ఓ లేఖ రూపంలో ఆ గాథ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖ ఎవరూ రాశారు. ఎవరిదీ ఆ ప్రేమ గాథ అనేది మాత్రం మిస్టరీ!

వివరాల్లోకెళ్తే..మిచిగాన్‌లోని గ్రాండ్‌ ర్యాపిడ్స్‌ అనే ప్రాంతం నుంచి హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ వెలుగులోకి వచ్చింది. రిక్‌ ట్రోజనోవ్స్కీ అనే వ్యక్తికి 70 ఏళ్ల నాటి ప్రేమలేఖ ఒకటి దొరికింది. అతడు 2017లో వ్యవసాయానికి సంబంధించిన వేలంలో ఓ టూల్‌ బాక్స్‌ని కొనుగోలు చేయగా, అందులో 70 ఏళ్ల క్రితం నాటి లేఖ బయటపడింది. అది శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆర్మీ కార్పోరల్‌ ఇర్విన్‌ ఫ్లెమింగ్‌ రాసిన లేఖ. గ్రాండ్‌ ర్యాపిడ్స్‌లో ఉంటున్న మేరీ లీ క్రిబ్స్‌ అనే మహిళకు రాసిన లేఖ అది.

అందులో.. "ఇన్నాళ్లు నీకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. దేశ సేవ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వివాహం చేసుకుంటాను". అని రాసి ఉంది. అయితే ఆ లేఖను ఎవరూ మర్చిపోయారనేది తెలియాల్సి ఉంది. దీంతో రిక్‌ ఆ లేఖకు సంబంధించిన వారితో ఆ లేఖను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ బాక్స్‌లో పెట్టి మర్చిపోయినా ఆ ప్రేమ లేఖ వెనుక ఉన్న కథను అన్వేషించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ సాయంతో ప్రేమికులైన ఫ్లెమింగ్‌, క్రిబ్స్‌ని కనుగొని లేఖలో ఉన్నట్లు వారి ప్రేమ సఫలం అయ్యిందో లేదా అని తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు.

అయితే తన అన్వేషణ ఫలిస్తుందో లేదో తెలియదు గానీ ఇది తనకు ప్రేమకున్న బలం, శక్తి గురించి గొప్ప అనుభూతిని ఇస్తుందని చెబుతున్నాడు రిక్‌. అయితే ఆ లేఖ ఈ రోజుల్లో రాసింది మాత్రం కాదంటున్నాడు రిక్‌. ఎందుకంటే ..ఆ లేఖ మొత్త కవిత్వంలా సాగింది. ప్రసతుతం రిక్‌ ఆ జంటకు సంబంధించిన బంధువులను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే దీని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా..వారి సంబంధికులు లేదా వారి పిల్లలను కనుక్కుంటే వారి ప్రేమ సఫలం అయ్యిందో లేదా తెలుసుకోగలను, అలాగే వారు కూడా ఓ గొప్ప అనుభూతిని పొందుతారు అని చెబుతున్నాడు రిక్‌. 

(చదవండి: మన ప్రేమలు ఏడు రకాలు!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top