
ఫుడ్ ఛాలెంజెస్‌లో ఒక్కోసారి ఇబ్బందులు తప్పవు. అప్పుడప్పుడూ ఊహించని దుష్పరిణామాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. లండన్‌లోని ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్లో హాటెస్ట్ కర్రీ తిని ఓ కంటెస్టెంట్ నానా ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది. పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.
లండన్ లోని హాటెస్ట్ కర్రీ..బెంగాల్ విలేజ్ (Bengal Village) లో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 72 ఘాటైన మసాలా దినుసులతో అత్యంత కారంగా ఈ కర్రీని వండి వారుస్తారు బెంగాల్ విలేజ్ వంటగాళ్లు. ముఖ్యంగా కారోలినా రీపర్, స్కాచ్ బోనెట్, నాగ, బర్డ్స్ ఐ,స్నేక్ చిల్లి వంటివి ఉపయోగిస్తారు. ఆవాలు, మెంతులు, జీలకర్ర మొదలైన వాటితో వండుతారు. గ్రేవీని నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయలు, మసాలా దినుసులు కొన్ని టమోటాలతో తయారు చేస్తారు. మధ్యలో పసుపు మిరపకాయను పైకి తిప్పి, తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డిస్తారు. తమిళ ప్రిన్స్, గనపతి , బాలుచి వంటివి కూడా ఉన్నాయి. ఇది వండేటపుడు చెఫ్‌లు గ్లౌజెస్ తప్పకుండా ధరిస్తారు.
ఇదీ చదవండి: చిన్న ప్రాణితో.. ప్రాణానికే ముప్పు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బెంగాల్ విలేజ్ అనేది UKలోని లండన్‌లోని బ్రిక్ లేన్‌లో ఉన్న ఒక భారతీయ వంటకాల రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అనేక ఆహార సవాళ్లకు ప్రసిద్ధి చెందింది, చాలా ధైర్యవంతులే హాటెస్ట్ కర్రీ ఛాలెంజ్‌లో పాల్గొంటారు. ఈ రెస్టారెంట్ అధికారిక X హ్యాండిల్‌లో ఇటీవల పోస్ట్ చేసిన వీడియోలో వారి "హాటెస్ట్ కర్రీ" ప్రయత్నించిన వ్యక్తి దయనీయ స్థితిలో ఉన్న కస్టమర్‌ను చూడవచ్చు. రెస్టారెంట్ యజమాని చేతిలో ఒక గ్లాసు నీరు పట్టుకుని బ్రో. కాసిన్ని నీళ్లు తాగు బ్రో.. ఒక్క సిప్ చాలు" అని రెస్టారెంట్ బతిమలాడుతున్నాడు. చివరికి ఒక గుక్క నీళ్లు తాగి అతగాడు తెప్పరిల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. (Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?)
After math of the #Londonshottestcurry pic.twitter.com/0SrpWWLTfH
— Bengal Village - Best of Brick Lane (@Bengal_Village) June 14, 2025