
అప్పుడప్పుడు వంటగది చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిన్న చిట్కాలున్నాయి.
పదును పెట్టే రాయి.. పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృథా కాదు.
నైఫ్ షార్ప్‌నర్.. ఎలక్ట్రిక్, మాన్యువల్ కత్తి షార్ప్‌నర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.
చాకుల్ని పొడిగా ఉంచాలి.. తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయి΄ోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.
చాపింగ్ బోర్ట్.. గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.
కటింగ్ టెక్నిక్.. చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కటింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
(చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం)