breaking news
sharp fall
-
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
అప్పుడప్పుడు వంటగది చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిన్న చిట్కాలున్నాయి.పదును పెట్టే రాయి.. పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృథా కాదు.నైఫ్ షార్ప్‌నర్.. ఎలక్ట్రిక్, మాన్యువల్ కత్తి షార్ప్నర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.చాకుల్ని పొడిగా ఉంచాలి.. తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయి΄ోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.చాపింగ్ బోర్ట్.. గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.కటింగ్ టెక్నిక్.. చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కటింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం) -
నార్త్‌కొరియా టెన్షన్: మార్కెట్ల భారీ పతనం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మరిన్ని నష్టాల్లోకి జారుకుని భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ధోరణితో మార్కెట్లో సెంటిమెంట్ దెబ్బతింది. ముఖ్యంగా ఆసియన్ మార్కెట్ల ప్రభావంతో మిడ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడి, లాభాల స్వీకరణ నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలను మరింత పెంచుకున్న కీలక ఇండెక్స్‌లు ప్రధాన మద్దతు స్థాయి కిందికి చేరాయి. 308 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ 31,583 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 99 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 9900 కిందికి పతనమైంది. ఆటో సహా దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఫార్మ, బ్యాంకింగ్ బలహీనంగా ఉండగా కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నామమాత్రంగా లాభపడుతోంది. ఐవోసీ, అదానీ, అంబుజీ, టెక్ మహీంద్రా, టాటాపవర్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పరుగులు పెడుతోంది. సోమవారం ఒక్కరోజే రూ.354 ఎగిసిన పసిడి పది గ్రా. రూ. 30,177 వద్ద కొనసాగుతుండడం విశేషం.