నార్త్‌కొరియా టెన్షన్‌: మార్కెట్ల భారీ పతనం | Market sees sharp fall in last few minutes. #Nifty Slips below 9900. #Markets at days low . Pharma, Banking Sector too weak | Sakshi
Sakshi News home page

నార్త్‌కొరియా టెన్షన్‌: మార్కెట్ల భారీ పతనం

Sep 4 2017 12:23 PM | Updated on Oct 17 2018 5:19 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మరిన్ని నష్టాల్లోకి జారుకుని భారీగా పతనమవుతున్నాయి.

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు  మరిన్ని నష్టాల్లోకి జారుకుని భారీగా పతనమవుతున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ధోరణితో మార్కెట్లో సెంటిమెంట్‌ దెబ్బతింది.  ముఖ్యంగా ఆసియన్‌ మార్కెట్ల ప్రభావంతో  మిడ్‌ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి, లాభాల స్వీకరణ నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఆరంభ నష్టాలను మరింత పెంచుకున్న కీలక ఇండెక్స్‌లు  ప్రధాన మద్దతు స్థాయి కిందికి చేరాయి. 308 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ 31,583 దగ్గర ట్రేడవుతోంది. అలాగే  99 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 9900   కిందికి పతనమైంది.

ఆటో సహా దాదాపు  అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఫార్మ, బ్యాంకింగ్‌ బలహీనంగా ఉండగా కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్  సెక్టార్‌ నామమాత్రంగా  లాభపడుతోంది. ఐవోసీ,  అదానీ, అంబుజీ, టెక్‌ మహీంద్రా, టాటాపవర్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

మరోవైపు ఎంసీఎక్స్‌ మార్కెట్లో పుత్తడి పరుగులు పెడుతోంది. సోమవారం ఒక్కరోజే రూ.354 ఎగిసిన పసిడి పది గ్రా. రూ. 30,177 వద్ద కొనసాగుతుండడం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement