కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది! | Sakshi
Sakshi News home page

కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!

Published Sun, Jun 25 2023 12:29 PM

Iconic Rock In Yorkshire Dales Goes On Sale For Jus Rs 155 Crores - Sakshi

కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌ డేల్స్‌ నేషనల్‌ పార్క్‌లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్‌సే క్రేగ్‌’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు.

దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్‌ డేల్స్‌లోని వార్ఫడేల్‌ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది.

(చదవండి: ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ఈ ఆర్డర్‌ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement