ఫైబ్రాయిడ్స్‌ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా? | Sakshi
Sakshi News home page

ఫైబ్రాయిడ్స్‌ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?

Published Sun, Oct 8 2023 12:04 PM

Hysterectomy For Cervical And Intraligamental Fibroids  - Sakshi

నా వయస్సిప్పుడు 28 సంవత్సరాలు. రొటీన్‌ స్కాన్‌లో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నట్టు తేలింది.  1–2 సెం.మీ సైజ్‌ అన్నారు. ఇప్పటికైతే నాకే ఇబ్బందీ లేదు. అయితే కొందరికి దీని వల్ల హిస్టరెక్టమీ అయిందని విన్నాను. అలా అవుతుందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఎన్‌. శుభదా, చంద్రపూర్‌

ఫైబ్రాయిడ్స్‌ అనేవి గర్భసంచిలో ఉండే మజిల్‌ ఓవర్‌గ్రోత్‌తో ఏర్పడే గడ్డలు. ఇవి కొంతమందికి చిన్న వయస్సులోనే అంటే 20–30 ఏళ్ల మధ్య హార్మోన్స్‌ ప్రాబ్లమ్‌తో ఏర్పడవచ్చు. 5 సెం.మీ లోపు ఉండే ఫైబ్రాయిడ్స్‌ చాలావరకు ఇబ్బంది పెట్టవు. స్కాన్‌లో మాత్రమే తెలుస్తాయి. వాటికి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కానీ కొన్ని పరిమాణంలో చిన్నవే అయినా ప్రాబ్లమ్‌ను క్రియేట్‌ చేస్తాయి. అలాంటి ఫైబ్రాయిడ్స్‌ గనుక గర్భసంచి లోపలి పొరల్లో గనుక ఫామ్‌ అయి ఉంటే పీరియడ్స్‌ టైమ్‌లో పెయిన్‌ ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావం అయ్యే చాన్సెస్‌ను కూడా పెంచుతాయి.

సింప్టమ్స్‌ ఏమైనా ఉన్నప్పుడు 3డీ అల్ట్రాసౌండ్‌ చేసి ఫైబ్రాయిడ్‌ సైజ్, లొకేషన్, నంబర్, మీ వయసు, ప్రెగ్నెన్సీ చాన్సెస్‌ మొదలైనవాటిపై డిస్కస్‌ చేస్తారు. ఫైబ్రాయిడ్స్‌ వల్ల అధిక రక్తస్రావం, రక్తహీనత, మూత్రం రావడం, మలబద్ధకం, ప్రెజర్‌ ఫీలింగ్‌ లాంటివి ఉండొచ్చు. భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్‌ పైనే డిస్కషన్స్‌ ఆధారపడి ఉంటాయి. 3 సెం.మీ లోపు ఉంటే చాలామందికి ఏ ఇంటర్‌వెన్షన్‌ చెప్పరు. సంవత్సరం తర్వాత మళ్లీ స్కాన్‌ చేసి సైజ్‌ చెక్‌ చేస్తారు. మీరు డాక్టర్‌ని కలసినప్పుడు మీ స్కానింగ్‌ రిపోర్ట్స్, బ్లడ్‌ రిపోర్ట్స్, మీ ఫ్యూచర్‌ ప్రెగ్నెన్సీ ప్లాన్‌ గురించి డిటేయిల్డ్‌గా డిస్కస్‌ చేయండి.

ఫాలో అప్‌ స్కాన్స్‌లో ఏమైనా సడెన్‌ గ్రోత్‌ ఉంటే ఫైబ్రాయిడ్స్‌కి మెడికల్, సర్జికల్‌ ట్రీట్‌మెంట్స్‌ ఉంటాయి అని సజెస్ట్‌ చేస్తారు. ఫైబ్రాయిడ్స్‌ సైజ్, లొకేషన్‌ని బట్టి ట్రీట్‌మెంట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. అధిక రక్తస్రావాన్ని నియంత్రించడానికి పిల్స్, ప్యాచెస్, ఇంప్లాంట్స్, మిరేనా కాయిల్‌ లాంటివి ఉన్నాయి. ఇవి ప్రెగ్నెన్సీని కూడా నిరోధిస్తాయి. అంటే కాంట్రాసెప్టివ్‌గా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్‌తో గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే ప్రసవం జరగొచ్చు. అలాంటివారిలో మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్‌ని లాపరోస్కోíపీ ద్వారా తీస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీకి ఏ ఇబ్బంది ఉండదు.

యూటరైన్‌ ఆర్టరీ ఎంబలైజేషన్‌ అనే ప్రక్రియ ద్వారా శరీరం మీద ఏ కోత లేకుండా బీడ్స్‌ ద్వారా ఫైబ్రాయిడ్స్‌కి రక్తప్రసరణను అందించే రక్తనాళాలను బ్లాక్‌ చేస్తారు. ఇది ఇక పిల్లలు వద్దు అనుకునే వాళ్లకు ఉపయుక్తమైనది. కొంతమందికి యూటరస్‌ లైనింగ్‌ని పూర్తిగా తగ్గించే ఎండోమెట్రియల్‌ అబ్‌లేషన్‌ అనే ప్రక్రియ ద్వారా కూడా ఈ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను ట్రీట్‌ చేస్తారు. హిస్టరెక్టమీ అనేది చివరి ఆప్షన్‌. మీకు ఏ చికిత్స మంచిది అనేది మీ పర్సనల్‌ హిస్టరీ తీసుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. సంప్రదిస్తే అసలు  మీకు ట్రీట్‌మెంట్‌ అవసరమా? ఎలాంటి ఫాలో అప్‌ కావాలి? వంటి విషయాలు నిర్ధారణవుతాయి. 
డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..)

Advertisement
Advertisement